SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu
Showing posts with label GOPALAKRUSHNUDU. Show all posts
Showing posts with label GOPALAKRUSHNUDU. Show all posts

Friday, January 21, 2011

GOPALAKRUSHNUDU


S.JANAKI

పో పో పో చెలి నేరాలేను చెలి 
చిన్ని గోపాలుడే మాయల్ వాడే
వేణుగోపాలుడై పోతున్నాడే చెలి
రారే సఖియలార పోదాం వేగ 


అడవిసందేవేళ పొనాము నున్నది
పొన్నమ నెక్కాడు
సీటీలు వేశాడు
రమ్మని పిలిచాడు
ఊలలువేశాడు గోపాలుడు


నిన్నసందేవేళ నీళ్ళల్లోనిలబడి 
సీటీలు వేసాడే ఊలలు వేసాడే
కూసుంటే కృష్ణమ్మ సెయ్యెట్టి 
పిలిచాడె గోపాలుడు


pO pO pO cheli nEraalEnu celi 
cinni gOpaaluDE maayal vaaDE
vENugOpAluDaipOtunnADE celi
raarE sakhiyalaara pOdaaM vEga 


aDavisaMdEvELa ponaamu nunnadi
ponnama nekkaaDu
sITIlu vESADu
rammani pilicaaDu
UlaluvESADu gOpAluDu


ninnasaMdEvELa nILLallOnilabaDi 
sITIlu vEsADE Ulalu vEsADE
kUsuMTE kRShNamma seyyeTTi 
pilicADe gOpAluDu

Friday, December 17, 2010

GOPALAKRUSHNUDU




AUDIO LINK


మల్లెపూలహారమెయ్యవే ఓయమ్మ నన్ను
మత్స్యావతారుడనవే


మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణ
మత్స్యావతారుడనెద


కుప్పికుచ్చుల జడలువెయ్యవే 
ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే


కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణ
కూర్మావతారుడనెద


వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను 
వరహావతారుడనవే


వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణ
వరహావతారుడనెద


నాణ్యమైన నగలువేయవే ఓయమ్మ 
నరసింహావతారుడనవే


నాణ్యమైన నగలువేసెదా ఓ కృష్ణ
నరసింహావతారుడనెద


వాయువేగ రథమునియ్యవే ఓయమ్మ నన్ను
వామనవతారుడనవే


వాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణ
వామనావతారుడనెద


పాలు పోసి బువ్వపెట్టవే ఓయమ్మ
పరశురామావతారుడనవే


పాలు పోసి బువ్వపెట్టెద గోపాలకృష్ణ
పరశురామావతారుడనెద


ఆనందబాలుడనవే ఓయమ్మ నన్ను 
అయోధ్యవాసుడనవే


ఆనందబాలుడనెద గోపాలకృష్ణ 
అయోధ్యవాసుడనెద


గోవులుకాచె బాలుడనవె ఓయమ్మ నన్ను 
గోపాలకౄష్ణుడనవే


గోవులుకాచె బాలుడనెద నాతండ్రి నిన్ను 
గోపాలకౄష్ణుడనెద


బుధ్ధులు కలిపి ముద్దపెట్టవే ఓయమ్మ నన్ను
బుధ్ధావతారుడనవే


బుధ్ధులు కలిపి ముద్దపెట్టెద గోపాలకృష్ణ 
బుధ్ధావతారుడనెద

కాళ్ళకు పసిడిగజ్జెలు కట్టవే ఓయమ్మ నన్ను
కలికావతారుడనవే


కాళ్ళకు పసిడిగజ్జెలు కట్టెద గోపాలకృష్ణ 
కలికావతారుడనెద

mallepUlahaarameyyavE Oyamma nannu
matsyaavataaruDanavE

mallepUlahaaramEsedaa gOpaalakRShNa
matsyaavataaruDaneda

kuppikuccula jaDaluveyyavE 
Oyamma nannu kUrmAvataaruDanavE

kuppikuccula jaDaluvEsedaa gOpAlakRShNa
kUrmaavataaruDaneda

varamulicci dIviMcavE Oyamma nannu 
varahaavatAruDanavE

varamulicci dIviMceda gOpaalakRShNa
varahaavatAruDaneda

naaNyamaina nagaluvEyavE Oyamma 
narasiMhaavataaruDanavE

naaNyamaina nagaluvEsedaa O kRShNa
narasiMhaavataaruDaneda

vaayuvEga rathamuniyyavE Oyamma nannu
vaamanavataaruDanavE

vaayuvEga rathamuniccedaa gOpAlakRShNa
vaamanaavataaruDaneda

paalu pOsi buvvapeTTavE Oyamma
paraSuraamaavataaruDanavE

paalu pOsi buvvapeTTeda gOpAlakRShNa
paraSuraamaavataaruDaneda

aanaMdabaaluDanavE Oyamma nannu 
ayOdhyavaasuDanavE

aanaMdabAluDaneda gOpaalakRShNa 
ayOdhyavaasuDaneda

gOvulukaace baaluDanave Oyamma nannu 
gOpaalakRuShNuDanavE

gOvulukaace baaluDaneda naataMDri ninnu 
gOpAlakRuShNuDaneda

budhdhulu kalipi muddapeTTavE Oyamma nannu
budhdhaavataaruDanavE

budhdhulu kalipi muddapeTTeda gOpAlakRShNa 
budhdhaavataaruDaneda
 
kaaLLaku pasiDigajjelu kaTTavE Oyamma nannu
kalikaavataaruDanavE

kaaLLaku pasiDigajjelu kaTTeda gOpAlakRShNa 
kalikaavataaruDaneda

Tuesday, December 14, 2010

GOPALAKRUSHNUDU




S.JANAKI

ఓ యశోద యేమిచేయుదుమే నీకొడుకు దుడుకులకు
ఓయశోద యేమిచేయుదుమే


నిన్న సందెవేళ మాచిన్నది జలకమ్ములాడ
వన్నెకాడు చీరలెత్తుకు పోయేకాదమ్మా
అయ్యయ్యో యీ అన్యాయం యెన్నడూ మేమెరుగమమ్మా
పిలిచి నీతో చెప్పబోతే కౄష్ణుడేమియెరుగడంటివి

ఆటకే నువు పోతివి రోటికే నేకడితిని
గొల్లభామలిండ్లకేగి కోర్కె తీర్చమంటివట
వద్దురా పోవద్దురా  యీరద్దులు మనకొద్దురా
ముద్దులయ్యా నేను చెప్పిన బుధ్ధులు విని యింటనుండు
వద్దురా పోవద్దురా

పల్లవపాణులుకూడి చల్లలమ్మగాను వారి
యిల్లుచేరి కొల్లగొట్టివెళ్ళె గాదమ్మా
అయ్యయ్యో యీ అన్యాయం యెన్నడూ మేమెరుగమమ్మా
పిలిచి నీతో చెప్పబోతే కౄష్ణుడేమియెరుగడంటివి

వెన్నముద్దల దొంగవు ఎవరికైనా లొంగవు
బయలుపడిన పొంగవు నాభావమెరిగి వుండవు
వద్దురా పోవద్దురా
ముద్దులయ్యా నేను చెప్పిన బుధ్ధులు విని యింటనుండు
వద్దురా పోవద్దురా

ఇట్లాగైతే కాపురము ఎట్లాగు వేగింతుమమ్మా
పట్టిదండింపరాదా పాపమేమమ్మా
వట్టిమాటలుగాదమ్మా మా చట్టిలోని వెన్న నేల-
కొట్టి పారవేసెనమ్మా దిట్టడై పరిగెత్తేనమ్మా


నిందలేవొడిగడితివి నీతులేచెడగొడితివి
కానిపనులకు పోతివి అపకీర్తి మనకుతెస్తివి
వద్దురా పోవద్దురా




O yaSOda yEmicEyudumE nIkoDuku duDukulaku
OyaSOda yEmicEyudumE


ninna saMdevELa maacinnadi jalakammulaaDa
vannekaaDu cIralettuku pOyEkaadammaa
ayyayyO yI anyaayaM yennaDU mEmerugamammaa
pilici nItO ceppabOtE kRuShNuDEmiyerugaDaMTivi


ATakE nuvu pOtivi rOTikE nEkaDitini
gollabhaamaliMDlakEgi kOrke tIrcamaMTivaTa
vadduraa pOvadduraa  yIraddulu manakodduraa
muddulayyaa nEnu ceppina budhdhulu vini yiMTanuMDu
vadduraa pOvadduraa


pallavapaaNulukUDi callalammagaanu vaari
yillucEri kollagoTTiveLLe gaadammaa
ayyayyO yI anyaayaM yennaDU mEmerugamammaa
pilici nItO ceppabOtE kRuShNuDEmiyerugaDaMTivi


vennamuddala doMgavu evarikainaa loMgavu
bayalupaDina poMgavu naabhaavamerigi vuMDavu
vadduraa pOvadduraa
muddulayyaa nEnu ceppina budhdhulu vini yiMTanuMDu
vadduraa pOvadduraa


iTlaagaitE kaapuramu eTlaagu vEgiMtumammaa
paTTidaMDiMparaadaa paapamEmammaa
vaTTimaaTalugaadammaa maa caTTilOni venna nEla-
koTTi paaravEsenammaa diTTaDai parigettEnammaa




niMdalEvoDigaDitivi nItulEceDagoDitivi
kaanipanulaku pOtivi apakIrti manakutestivi
vadduraa pOvadduraa

Friday, December 10, 2010

GOPALAKRUSHNUDU



AUDIO LINK--S.JANAKI

కస్తూరి రంగ రంగ మా యన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా


కంసుణ్ణి సంహరింప సద్గురుడు  అవతారమెత్తినపుడు 
దేవకీగర్భమునను కౄష్ణావతారమై జన్మించెను


ఏడు రాత్రుళ్ళు కలిసి  తానుగా ఏక రాత్రిగ చేసెను
ఆదివారము పూటను  అష్టమి దినమందు జన్మించెను


తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు 
ఎదురు కాళ్ళను పుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు


పాలవర్షము కురిసెను అప్పుడా బాలపై చల్లగానే
తడివస్త్రమును విడిచెను  దేవకీ పొడివస్త్రములు గట్టెను


వసుదేవపుత్రుడమ్మా యీ బిడ్డ వైకుంఠవాసుడమ్మా
అడ్డాలలోవేసుకు ఆబాల చక్కదనమును చూసెను


యీబిడ్డ వైకుంఠ వాసుడమ్మా

kastUri raMga raMga maa yanna kAvETi raMga raMga
SrIraMga raMga ninu baasi nEneTlu maracuMduraa

kaMsuNNi saMhariMpa sadguruDu  avataaramettinapuDu 
dEvakIgarbhamunanu kRuShNAvataaramai janmiMcenu

EDu rAtruLLu kalisi  taanugaa Eka raatriga cEsenu
aadivaaramu pUTanu  aShTami dinamaMdu janmiMcenu

talatOTi jananamaitE tanaku bahu mOsaMbu vaccunanucu 
eduru kaaLLanu puTTenu EDuguru daadulanu caMpenapuDu

paalavarShamu kurisenu appuDA baalapai callagaanE
taDivastramunu viDicenu  dEvakI poDivastramulu gaTTenu

vasudEvaputruDammaa yI biDDa vaikuMThavaasuDammaa
aDDAlalOvEsuku aabaala cakkadanamunu cUsenu

yIbiDDa vaikuMTha vaasuDammaa

Wednesday, December 8, 2010

GOPALAKRUSHNUDU




S.JANAKI


ఎంత చక్కని తనయుడే యశోదకిపుడు యెంతచక్కని తనయుడే


కాంతలార మీరు కదలిరారే వేగ కన్నులపండుగగలిగె కౄష్ణుని చూడ


వర్ణించగానూతరమా వాని సోయగము వెడలిచూతము రారమ్మా
మానినులార మనవైకుంఠధాముడు మనల దయచూచుటకు మహినిజన్మించేను


పరిపూర్ణమైన చంద్రుడే పరమాత్ముడే పంకజనాభుడీతడే
పరమపవిత్రుడు పన్నగశయనుడు పంకజాక్షుడు మన యశోదకిపుడు



eMta cakkani tanayuDE yaSOdakipuDu yeMtacakkani tanayuDE


kaaMtalaara mIru kadaliraarE vEga kannulapaMDugagalige kRuShNuni cUDa


varNiMcagaanUtaramaa vaani sOyagamu veDalicUtamu raarammaa
maaninulaara manavaikuMThadhaamuDu manala dayacUcuTaku mahinijanmiMcEnu


paripUrNamaina caMdruDE paramaatmuDE paMkajanaabhuDItaDE
paramapavitruDu pannagaSayanuDu paMkajAkShuDu mana yaSOdakipuDu





Wednesday, November 17, 2010

GOPALAKRUSNUDU


బంగారుచెంబుతో పన్నీరుపట్టుకు పణతిరుక్మిణివచ్చె మేలుకో
రంగైనపాదాలు చెంగట పూనుకు రమణి సత్య వచ్చె మేలుకో
తెలవారవచ్చేను

దంతకాష్టముపూని తామరసాక్షి సుదంతి వచ్చిందయ్యా మేలుకో
అంతకుమున్ను రుమాళ్ళు పట్టుకు జాంవతి వచ్చింది మేలుకో
తెలవారవచ్చేను

పొందుగ కస్తూరి భరిణె పట్టుకుకాళింది వచ్చిందయ్యా మేలుకో
అందముగానిలువుటద్దముగొని మిత్రవింద వచ్చిందయ్యా మేలుకో
తెలవారవచ్చేను

పంచభక్ష్యాన్నములు పళ్ళెములోవుంచుకు భద్ర వచ్చిందయ్యా మేలుకో
వాలాయముగ తాంబూలము పట్టుకు లక్షణ వచ్చింది మేలుకో
తెలవార వచ్చేను

పొందుగ వీణవాయించుతూ రాకేందురాధ వచ్చిందయ్యా మేలుకో
పదహారువేలస్త్రీలంతా స్వగతాలపాళి తెచ్చున్నారు మేలుకో
తెలవార వచ్చేను


baMgAruceMbutO pannIrupaTTuku paNatirukmiNivacce mElukO
raMgainapaadaalu ceMgaTa pUnuku ramaNi satya vacce mElukO
telavaaravaccEnu

daMtakaaShTamupUni taamarasaakShi sudaMti vacciMdayyaa mElukO
aMtakumunnu rumALLu paTTuku jaaMvati vacciMdi mElukO
telavaaravaccEnu

poMduga kastUri BariNe paTTukukaaLiMdi vacciMdayyaa mElukO
aMdamugaaniluvuTaddamugoni mitraviMda vacciMdayyA mElukO
telavaaravaccEnu

paMcaBakShyaannamulu paLLemulOvuMcuku bhadra vacciMdayyaa mElukO
vaalaayamuga taaMbUlamu paTTuku lakShaNa vacciMdi mElukO
telavaara vaccEnu

poMduga vINavaayiMcutU raakEMduraadha vacciMdayyaa mElukO
padahaaruvElastrIlaMtaa swagataalapaaLi teccunnaaru mElukO