SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Monday, October 1, 2012




Thursday, August 9, 2012

అతి మనోహరంగా అత్యంత మధురంగా ఆలపించిన మనోహర స్తోత్రము. దేవదేవుడైన శ్రీకృష్ణుని జనమాష్టమి  పర్వదినాన విని ఆస్వాదించి ఆనందించి ఆ రాధామనోహరునితో మీరు కూడా బృందావనంలో విహరించండి
AUDIO LINK : MANOHARA STOTRAMU

మనోహర స్తొత్రం
నవజలధర విద్యుద్యోతవర్ణౌ ప్రసన్నౌ
వదన నయన పద్మౌ చారుచంద్రావతంసౌ
అలక తిలక ఫాలౌ కేశవేశ ప్రఫుల్లౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

వసన హరిత నీలౌ చందనాలేపనాంగౌ
మణిమరకత దీప్తౌ స్వర్ణమాల ప్రయుక్తౌ
కనక వలయ హస్తౌ రాసమాఢ్య పసక్తౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అతిమధుర సురేశౌ రంగభంగీ త్రిభంగౌ
మధుర మౄదుల హాసౌ కుందలాకార్ణ కర్ణౌ
నటవర వర రమ్యౌ నౄత్య గీతానురక్తౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

వివిధగుణ విభద్ధౌ వందననీయౌ సురేశౌ
మణిమయ మకరాధ్యై: శోభితాంగౌ స్ఫురంతౌ
స్మిత నమిత కటాక్షౌ ధర్మకర్మ ప్రశస్తౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

కనక మకుట చూడౌ పుష్పితో భూషితాంగౌ
సకల వన నివిష్టౌ సుందరానందకుంజౌ
చరణకమల దివ్యౌ దేవదేవాది సేవ్యౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అతి సులలిత గాత్రౌ గంధమాల్యై విరాజౌ
కతికతి రమణీయాం సేవ్య మానౌ సురేశౌ
ముని సురగణ భావ్యౌ వేదసాశ్త్రాది విజ్ౙౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అతిసుమధురమూర్తి దుష్టదర్ప ప్రశాంతి
సురవర వరదౌ ద్వౌ సర్వసిద్ధి ప్రదానౌ
అతిరస వశమగ్నౌ గీత వాద్య ప్రతీనౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

అగమనిగమ సారౌ సౄష్టి సంహార కారౌ
బయసి నవకిశోరౌ నిత్య బౄందావనస్థౌ
శమర భయ వినాశౌ పాపినస్తాన యంతౌ
భజభజతు మనోరే రాధికా కౄష్ణచంద్రౌ

ఇదం మనోహర స్తోత్రం శ్రద్ధయా య:పఠేన్నర:
రాధికా కౄష్ణచంద్రౌచ సిద్ధిరాలా ప్రశంశయ:


manOhara stotraM
navajaladhara vidyudyOtavarNou prasannau
vadana nayana padmou chaaruchaMdraavataMsou
alaka tilaka phaalou kESavESa praphullou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

vasana harita nIlou chaMdanaalEpanaaMgou
maNimarakata dIptou swarNamaala prayuktou
kanaka valaya hastou raasamaaDhya pasaktou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

atimadhura surESou raMgabhaMgI tribhaMgou
madhura mRudula haasou kuMdalaakaarNa karNou
naTavara vara ramyou nRutya gItaanuraktou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

vividhaguNa vibhaddhou vaMdananIyou surESou
maNimaya makaraadhyai: SObhitaaMgou sphuraMtou
smita namita kaTaakShou dharmakarma praSastou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

kanaka makuTa chUDou puShpitO bhUShitaaMgou
sakala vana niviShTou suMdaraanaMdakuMjou
charaNakamala divyou dEvadEvaadi sEvyou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

ati sulalita gaatrou gaMdhamaalyai viraajou
katikati ramaNIyaaM sEvya maanou surESou
muni suragaNa bhaavyou vEdasaaStraadi vij~jou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

atisumadhuramUrti duShTadarpa praSaaMti
suravara varadou dvou sarvasiddhi pradaanou
atirasa vaSamagnou gIta vaadya pratInou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

agamanigama saarou sRuShTi saMhaara kaarou
bayasi navakiSOrou nitya bRuMdaavanasthou
Samara bhaya vinaaSou paapinastaana yaMtou
bhajabhajatu manOrE raadhikaa kRuShNachaMdrou

idaM manOhara stOtraM Sraddhayaa ya:paThEnnara:
raadhikaa kRuShNachaMdroucha siddhiraalaa praSaMSaya:


Monday, June 4, 2012

Audio Link:G.Balakrishna Prasad
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||

చ|| జీవస్వరూపము చింతించి యంతటాను | దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే | వేవేలు విధముల వేదాంత రహస్యము ||


చ|| తనలోని (వి)జ్ఞానము తప్పకుండా తలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుటే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||


చ|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||


Lyrics in English pa|| mUDEmATalu mUDumUMDlu tommidi | vEDukoni cadavarO vEdAMta rahasyamu ||


ca|| jIvasvarUpamu ciMtiMci yaMtaTAnu | dEvuni vaiBavamu telisi |
BAviMci prakRti saMpadayidi yeruguTE | vEvElu vidhamula vEdAMta rahasyamu ||


ca|| tanalOni (vi)j~nAnamu tappakuMDA talabOsi | panitODa naMduvalla Baktinilipi |
manikigA vairAgyamu maravakuMDuTE | vinavalasina yaTTi vEdAMta rahasyamu ||


ca|| vEDukatO nAcArya viSvAsamu galigi | jADala SaraNAgati sAdhanamutO |
kUDi SrIvEMkaTESugolici dAsuDauTE | vIDani brahmAnaMda vEdAMta rahasyamu ||

Monday, May 21, 2012

Annamayya Nrusimha Sankirtanalu


Ihaparamulakunu_Audio Link GBK

ప|| ఇహపరములకును ఏలికవు | బహురూపంబుల ప్రహ్లాదవరదుడు ||

చ|| వేయికరంబుల వివిధాయుధంబుల | దాయల నడచిన దైవమవు |
నీయందున్నవి నిఖిల జగంబులు | పాయక మమ్మేలు ప్రహ్లాదవరద ||

చ|| కదిమి దుష్టులను గతము చేసితివి | త్రిదశుల గాచిన దేవుడవు |
వదల కిందరికి వరములొసంగగ | బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద ||

చ|| శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు | కావలసినచో కలుగుదువు |
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన | భావింతు నీమూర్తి ప్రహ్లద వరద ||

pa|| ihaparamulakunu Elikavu | bahurUpaMbula prahlAdavaraduDu ||

ca|| vEyikaraMbula vividhAyudhaMbula | dAyala naDacina daivamavu |
nIyaMdunnavi niKila jagaMbulu | pAyaka mammElu prahlAdavarada ||

ca|| kadimi duShTulanu gatamu cEsitivi | tridaSula gAcina dEvuDavu |
vadala kiMdariki varamulosaMgaga | bratikiti midivO prahlAdavarada ||

ca|| SrIvallaBuDavu cittajaguruDavu | kAvalasinacO kaluguduvu |
SrIvEMkaTAdrini SrI ahObalAna | BAviMtu nImUrti prahlada varada ||

Friday, April 13, 2012

PRAVACHANAMS

ఈ వెబ్ సైట్ లోకి ఎప్పుడైన తొంగి చూసార? ఒక్కసారి వేళితే మీకే తెలుస్తుంది.  ఎందరో మాహానుభావుల  ప్రవచనములను అందరికీ అందుబాటులోకి తెస్తున్న ఒక మహోన్నతమైన బృహత్కార్యము చేస్తున్నారు ప్రవచచనం.కాం వారు వారికి జయహో .http://www.pravachanam.com/

Wednesday, February 15, 2012

Audio Link;CHUDARAMMA IDE NEDU SUKKARAARAMU
చూడరమ్మ యిదె నేడు సుక్కురారము
వేడుక చక్కదనాలు వేవేలైనాడు


చప్పుడుతో పన్నీటి మజ్జనముతో నున్నవాడు
అప్పుడే ఆదినారాయాణునివలె
కప్పురకాపామీద కడుఁబూసుకున్నవాడు
ముప్పిరి బులుకడిగె ముత్యమువలె


పొసగెనప్పటి తట్టుపుణుగులందుకున్నాడు
కసుగందని కాలమేఘమువలెను
సుసగాన మేనునిండా సొమ్మువెట్టుకున్నాడు
పసల పద్దరువన్నె బంగారువలెను


అలమేల్మంగను యురమందు నిడుకొన్నవాడు
యెలమి సంపదలకు యిల్లువలెను
అలరుచు శ్రీవేంకటాద్రిమీదనున్నవాడు
కలబోసి చూడగా దొంతరకొండవలెను


cUDaramma yide nEDu sukkurAramu
vEDuka cakkadanaalu vEvElainADu

cappuDutO pannITi majjanamutO nunnavADu
appuDE AdinaaraayaaNunivale
kappurakaapaamIda kaDu@MbUsukunnavaaDu
muppiri bulukaDige mutyamuvale

posagenappaTi taTTupuNugulamdukunnADu
kasugamdani kaalamEghamuvalenu
susagaana mEnuniMDA sommuveTTukunnADu
pasala paddaruvanne bamgaaruvalenu

Monday, January 16, 2012

JIVATMUDAIYUNDU CHILUKA

Audio Link:Jivatmudaiyundu chiluka
జీవాతుమై యుండు చిలుకా నీ-వావలికి పరమాత్ముడై యుండు చిలుకా

ఆతుమపంజరములోన నయమున నుండి నా-చేతనే పెరిగిన చిలుకా
జాతిగా కర్మపు సంకెళ్ళ బడి కాలఁ జేతఁ బేదైతివే చిలుకా

భాతిగా చదువులు పగలురేలును నా చేత నేరిచినట్టి చిలుకా
రీతిగా దేహంబురెక్కలచాటున నుండి సీతుకోరువ లేని చిలుకా

బెదరి అయిదుగిరికిని భీతి పొందుచు కడు జెదరగ జూతువే చిలుకా
అదయులయ్యిన శత్రులారుగురికిగాక ఆడిచి(అదిరి)పడుదువే నీవు చిలుకా

వదలకిటు యాహారవాంఛ నటు పదివేలు- వదరులు వదరేటి చిలుకా
తుదలేని మమతలు తోరమ్ము సేసి నా తోగూడి మెలగిన చిలుకా

నీవన నెవ్వరు నేనన నెవ్వరు నీవే నేనైయుందు చిలుకా
శ్రీవెంకటాద్రి పై చిత్తములో నుండి సేవించుకొని గట్టి చిలుకా

దైవమానుషములు తలపించి యెపుడు నా -తలపునఁబాయని చిలుకా
యేవియును నిజముగా విని యేటికవి నాకు నెఱిగించి నటువంటి చిలుకా

 

jIvAtumai yuMDu chilukA nI-vAvaliki paramAtmuDai yuMDu chilukA

AtumapaMjaramulOna nayamuna nuMDi nA- chEtanE perigina chilukA
jAtigA karmapu saMkeLLa baDi kAla@M jEta@M bEdaitivE chilukA

bhAtigA chaduvulu pagalurElunu nA chEta nErichinaTTi chilukA
rItigA dEhaMburekkalachATuna nuMDi sItukOruva lEni chilukA

bedari ayidugirikini bhIti poMduchu kaDu jedaraga jUtuvE chilukA
adayulayyina SatrulArugurikigAka ADichi(adiri)paDuduvE nIvu chilukA

vadalakiTu yAhAravAMCha naTu padivElu- vadarulu vadarETi chilukA
tudalEni mamatalu tOrammu sEsi nA tOgUDi melagina chilukA

nIvana nevvaru nEnana nevvaru nIvE nEnaiyuMdu chilukA
SrIveMkaTAdri pai chittamulO nuMDi sEviMchukoni gaTTi chilukA

daivamAnushamulu talapiMchi yepuDu nA - talapuna@MbAyani chilukA
yEviyunu nijamugA vini yETikavi nAku ne~rigiMchi naTuvaMTi chilukA

TEGAKA PARAMUNAKU

Audio Link: Tegaka Paramunaku_RagaM-Lalithapancham

తెగక పరమునకు తెరువు లేదు
పగయెల్లా విడువక భవమూ పోదు
కన్నులయెదుటనున్న కాంచనము పై మమత
వున్నంతతడవు మోక్షమొనగూడదు
అన్నముతోడి రుచుల యలమట గలదాకా
పన్నిన సుజ్ఞానము పదిలము గాదు 


పక్కనున్న కాంతల భ్రమగల కాలము
మిక్కిలి శ్రీహరి భక్తి మెరయలేదు
వెక్కసపు సంసారవిధి నున్నంతతడవు 
నిక్కి పరమధర్మము నిలుకడ గాదు 


చిత్తములోపలి పలు చింతలు మానినదాకా
సత్తుగా వైరాగ్యము సమకూడదు
యిత్తల శ్రీవేంకటేశు డేలిన దాసులకైతే
హత్తి వైకుంఠపదవి అప్పుడే కలదు 


tegaka paramunaku teruvu lEdu
pagayellA viDuvaka bhavamU pOdu
kannulayeduTanunna kAMchanamu pai mamata
vunnaMtataDavu mOkshamonagUDadu
annamutODi ruchula yalamaTa galadAkA
pannina suj~nAnamu padilamu gAdu 


pakkanunna kAMtala bhramagala kAlamu
mikkili SrIhari bhakti merayalEdu
vekkasapu saMsAravidhi nunnaMtataDavu 
nikki paramadharmamu nilukaDa gAdu 


chittamulOpali palu chiMtalu mAninadAkA
sattugA vairAgyamu samakUDadu
yittala SrIvEMkaTESu DElina dAsulakaitE
hatti vaikuMThapadavi appuDE kaladu