SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Wednesday, December 29, 2010

VAIKUMTHA EKADASI--UTTARADWARAM



















TARIGOMDA VEMGAMAMBA SAMKIRTANALU




JAYA-RAMAA

జయరమాహృదయేశ జయ చిద్ప్రకాశ
జయ తరిగొండేశ జయవేంకటేశ


జయరజతాద్రీశ జయపార్వతీశ
జయసర్వభూతేశ చంద్రసంకాశ


జయనిఖిలాధ్యక్ష జయపంకజాక్ష
జయద్వితిసుతశిక్ష జయభక్తరక్ష


జయసత్యచారిత్ర జయఫాలనేత్ర
జయపరమపవిత్ర జయపంచవక్త్ర


వందనము సర్వభూతాత్మ వందనంబు
వందనము విశ్వపరిపూర్ణ వందనంబు
వందనము సత్యసంకల్ప వందనంబు
వందనము కృష్ణ పదివేల వందనంబు


స్వామి గోవింద మాధవ శరణు శరణు
షడ్గుణైశ్వర్యసంపన్న శరణు శరణు
చంద్రశేఖరసన్మిత్ర శరణు శరణు
వరదతరిగొండనరసింహా శరణు శరణు



jayaramaahRdayESa jaya cidprakaaSa
jaya tarigoMDESa jayavEMkaTESa


jayarajataadrISa jayapaarvatISa
jayasarvabhUtESa caMdrasaMkASa


jayanikhilaadhyakSha jayapaMkajAkSha
jayadwitisutaSikSha jayabhaktarakSha


jayasatyacAritra jayaphaalanEtra
jayaparamapavitra jayapaMcavaktra


vaMdanamu sarvabhUtaatma vaMdanaMbu
vaMdanamu viSwaparipUrNa vaMdanaMbu
vaMdanamu satyasaMkalpa vaMdanaMbu
vaMdanamu kRShNa padivEla vaMdanaMbu


swaami gOviMda maadhava SaraNu SaraNu
ShaDguNaiSwaryasaMpanna SaraNu SaraNu
caMdraSEkharasanmitra SaraNu SaraNu
varadatarigoMDanarasiMhaa SaraNu SaraNu



Monday, December 20, 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA

AUDIO LINK

కొమ్మనీపలుకులకు కుశలమస్తు
సమ్మదపు వయసుకు యైశ్వర్యమస్తు

బెడగు కళలను చాల పెంపొందించుచున్న నీ
యుడురాజు మోమునకభ్యుదయమస్తు
కడివోనినీరజపు కళికలను గేరు నీ
నెడద కుచములకు నభివృధ్ధిరస్తు

వొగరుమిగులగ తేనెలొలుకునున్నట్టి నీ
చిగురుమోవికిని ఫలసిద్ధిరస్తు
సొగసుచక్రములతో సొలయు నీపిరుదులకు
అగణితమనోరధావ్యాప్తిరస్తు

తనరు తుమ్మెదగముల తరము నీకురులకును
అనుపమంబైన దీర్ఘాయురస్తు
నను ద్వారకాకృష్ణుడనుచు గూడిన నీకు
అనుదినము నిత్యకళ్యాణమస్తు

kommanIpalukulaku kuSalamastu
sammadapu vayasuku yiSwaryamastu

beDagu kaLalanu cAla peMpoMdiMcucunna nI
yuDurAju mOmunakabhyudayamastu
kaDivOninIrajapu kaLikalanu gEru nI
neDada kucamulaku nabhivRdhdhirastu

vogarumigulaga tEnelolukununnaTTi nI
cigurumOvikini phalasiddhirastu
sogasucakramulatO solayu nIpirudulaku
agaNitamanOradhaavyaaptirastu

tanaru tummedagamula taramu nIkurulakunu
anupamaMbaina dIrghaayurastu
nanu dwaarakaakRShNuDanucu gUDina nIku
anudinamu nityakaLyANamastu



NADANIRAJANAM






Friday, December 17, 2010

GOPALAKRUSHNUDU




AUDIO LINK


మల్లెపూలహారమెయ్యవే ఓయమ్మ నన్ను
మత్స్యావతారుడనవే


మల్లెపూలహారమేసెదా గోపాలకృష్ణ
మత్స్యావతారుడనెద


కుప్పికుచ్చుల జడలువెయ్యవే 
ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే


కుప్పికుచ్చుల జడలువేసెదా గోపాలకృష్ణ
కూర్మావతారుడనెద


వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను 
వరహావతారుడనవే


వరములిచ్చి దీవించెద గోపాలకృష్ణ
వరహావతారుడనెద


నాణ్యమైన నగలువేయవే ఓయమ్మ 
నరసింహావతారుడనవే


నాణ్యమైన నగలువేసెదా ఓ కృష్ణ
నరసింహావతారుడనెద


వాయువేగ రథమునియ్యవే ఓయమ్మ నన్ను
వామనవతారుడనవే


వాయువేగ రథమునిచ్చెదా గోపాలకృష్ణ
వామనావతారుడనెద


పాలు పోసి బువ్వపెట్టవే ఓయమ్మ
పరశురామావతారుడనవే


పాలు పోసి బువ్వపెట్టెద గోపాలకృష్ణ
పరశురామావతారుడనెద


ఆనందబాలుడనవే ఓయమ్మ నన్ను 
అయోధ్యవాసుడనవే


ఆనందబాలుడనెద గోపాలకృష్ణ 
అయోధ్యవాసుడనెద


గోవులుకాచె బాలుడనవె ఓయమ్మ నన్ను 
గోపాలకౄష్ణుడనవే


గోవులుకాచె బాలుడనెద నాతండ్రి నిన్ను 
గోపాలకౄష్ణుడనెద


బుధ్ధులు కలిపి ముద్దపెట్టవే ఓయమ్మ నన్ను
బుధ్ధావతారుడనవే


బుధ్ధులు కలిపి ముద్దపెట్టెద గోపాలకృష్ణ 
బుధ్ధావతారుడనెద

కాళ్ళకు పసిడిగజ్జెలు కట్టవే ఓయమ్మ నన్ను
కలికావతారుడనవే


కాళ్ళకు పసిడిగజ్జెలు కట్టెద గోపాలకృష్ణ 
కలికావతారుడనెద

mallepUlahaarameyyavE Oyamma nannu
matsyaavataaruDanavE

mallepUlahaaramEsedaa gOpaalakRShNa
matsyaavataaruDaneda

kuppikuccula jaDaluveyyavE 
Oyamma nannu kUrmAvataaruDanavE

kuppikuccula jaDaluvEsedaa gOpAlakRShNa
kUrmaavataaruDaneda

varamulicci dIviMcavE Oyamma nannu 
varahaavatAruDanavE

varamulicci dIviMceda gOpaalakRShNa
varahaavatAruDaneda

naaNyamaina nagaluvEyavE Oyamma 
narasiMhaavataaruDanavE

naaNyamaina nagaluvEsedaa O kRShNa
narasiMhaavataaruDaneda

vaayuvEga rathamuniyyavE Oyamma nannu
vaamanavataaruDanavE

vaayuvEga rathamuniccedaa gOpAlakRShNa
vaamanaavataaruDaneda

paalu pOsi buvvapeTTavE Oyamma
paraSuraamaavataaruDanavE

paalu pOsi buvvapeTTeda gOpAlakRShNa
paraSuraamaavataaruDaneda

aanaMdabaaluDanavE Oyamma nannu 
ayOdhyavaasuDanavE

aanaMdabAluDaneda gOpaalakRShNa 
ayOdhyavaasuDaneda

gOvulukaace baaluDanave Oyamma nannu 
gOpaalakRuShNuDanavE

gOvulukaace baaluDaneda naataMDri ninnu 
gOpAlakRuShNuDaneda

budhdhulu kalipi muddapeTTavE Oyamma nannu
budhdhaavataaruDanavE

budhdhulu kalipi muddapeTTeda gOpAlakRShNa 
budhdhaavataaruDaneda
 
kaaLLaku pasiDigajjelu kaTTavE Oyamma nannu
kalikaavataaruDanavE

kaaLLaku pasiDigajjelu kaTTeda gOpAlakRShNa 
kalikaavataaruDaneda

Wednesday, December 15, 2010

KRISHNARAVALI




Meluko-kannayya
మేలుకో కన్నయ్య మేలుకోవయ్యా
వేగమే మేలుకొని మమ్మేలుకోవయ్యా


అందాలబాలరవి లేలేతకిరణాల అంబరము వింతగా శోభిల్లు తరియాయె
పందాలువేసుకొని పడుచు భామలు అందచందాలముగ్గులను తీర్చేటి తరియాయె


వేయిపడగల నాగరాజుపై శయనించి వేల్పులందరు భక్తియుక్తులైయొనరించు 
వేలాది వందనములందుకొనువేళాయె వేణుగానవిలోల వేగమే మేలుకో


అజ్ఞానతిమిరాన యే దారి కనరాక అల్లలాడే భీతమానవులందరికీ 
సుజ్ఞాన కాంతులను వెదజల్లి దరిజేర్చి విజ్ఞానులను చేయు వేళాయె మేలుకో

mElukO kannayya mElukOvayyaa
vEgamE mElukoni mammElukOvayyaa

aMdAlabaalaravi lElEtakiraNAla aMbaramu viMtagaa SOBillu tariyaaye
paMdaaluvEsukoni paDucu bhaamalu aMdacaMdAlamuggulanu tIrcETi tariyaaye

vEyipaDagala nAgaraajupai SayaniMci vElpulaMdaru bhaktiyuktulaiyonariMcu 
vElaadi vaMdanamulaMdukonuvELAye vENugaanavilOla vEgamE mElukO

aj~naanatimiraana yE daari kanaraaka allalaaDE bhItamaanavulaMdarikI 
suj~naana kaaMtulanu vedajalli darijErci vij~naanulanu cEyu vELAye mElukO

Tuesday, December 14, 2010

GOPALAKRUSHNUDU




S.JANAKI

ఓ యశోద యేమిచేయుదుమే నీకొడుకు దుడుకులకు
ఓయశోద యేమిచేయుదుమే


నిన్న సందెవేళ మాచిన్నది జలకమ్ములాడ
వన్నెకాడు చీరలెత్తుకు పోయేకాదమ్మా
అయ్యయ్యో యీ అన్యాయం యెన్నడూ మేమెరుగమమ్మా
పిలిచి నీతో చెప్పబోతే కౄష్ణుడేమియెరుగడంటివి

ఆటకే నువు పోతివి రోటికే నేకడితిని
గొల్లభామలిండ్లకేగి కోర్కె తీర్చమంటివట
వద్దురా పోవద్దురా  యీరద్దులు మనకొద్దురా
ముద్దులయ్యా నేను చెప్పిన బుధ్ధులు విని యింటనుండు
వద్దురా పోవద్దురా

పల్లవపాణులుకూడి చల్లలమ్మగాను వారి
యిల్లుచేరి కొల్లగొట్టివెళ్ళె గాదమ్మా
అయ్యయ్యో యీ అన్యాయం యెన్నడూ మేమెరుగమమ్మా
పిలిచి నీతో చెప్పబోతే కౄష్ణుడేమియెరుగడంటివి

వెన్నముద్దల దొంగవు ఎవరికైనా లొంగవు
బయలుపడిన పొంగవు నాభావమెరిగి వుండవు
వద్దురా పోవద్దురా
ముద్దులయ్యా నేను చెప్పిన బుధ్ధులు విని యింటనుండు
వద్దురా పోవద్దురా

ఇట్లాగైతే కాపురము ఎట్లాగు వేగింతుమమ్మా
పట్టిదండింపరాదా పాపమేమమ్మా
వట్టిమాటలుగాదమ్మా మా చట్టిలోని వెన్న నేల-
కొట్టి పారవేసెనమ్మా దిట్టడై పరిగెత్తేనమ్మా


నిందలేవొడిగడితివి నీతులేచెడగొడితివి
కానిపనులకు పోతివి అపకీర్తి మనకుతెస్తివి
వద్దురా పోవద్దురా




O yaSOda yEmicEyudumE nIkoDuku duDukulaku
OyaSOda yEmicEyudumE


ninna saMdevELa maacinnadi jalakammulaaDa
vannekaaDu cIralettuku pOyEkaadammaa
ayyayyO yI anyaayaM yennaDU mEmerugamammaa
pilici nItO ceppabOtE kRuShNuDEmiyerugaDaMTivi


ATakE nuvu pOtivi rOTikE nEkaDitini
gollabhaamaliMDlakEgi kOrke tIrcamaMTivaTa
vadduraa pOvadduraa  yIraddulu manakodduraa
muddulayyaa nEnu ceppina budhdhulu vini yiMTanuMDu
vadduraa pOvadduraa


pallavapaaNulukUDi callalammagaanu vaari
yillucEri kollagoTTiveLLe gaadammaa
ayyayyO yI anyaayaM yennaDU mEmerugamammaa
pilici nItO ceppabOtE kRuShNuDEmiyerugaDaMTivi


vennamuddala doMgavu evarikainaa loMgavu
bayalupaDina poMgavu naabhaavamerigi vuMDavu
vadduraa pOvadduraa
muddulayyaa nEnu ceppina budhdhulu vini yiMTanuMDu
vadduraa pOvadduraa


iTlaagaitE kaapuramu eTlaagu vEgiMtumammaa
paTTidaMDiMparaadaa paapamEmammaa
vaTTimaaTalugaadammaa maa caTTilOni venna nEla-
koTTi paaravEsenammaa diTTaDai parigettEnammaa




niMdalEvoDigaDitivi nItulEceDagoDitivi
kaanipanulaku pOtivi apakIrti manakutestivi
vadduraa pOvadduraa

Friday, December 10, 2010

GOPALAKRUSHNUDU



AUDIO LINK--S.JANAKI

కస్తూరి రంగ రంగ మా యన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా


కంసుణ్ణి సంహరింప సద్గురుడు  అవతారమెత్తినపుడు 
దేవకీగర్భమునను కౄష్ణావతారమై జన్మించెను


ఏడు రాత్రుళ్ళు కలిసి  తానుగా ఏక రాత్రిగ చేసెను
ఆదివారము పూటను  అష్టమి దినమందు జన్మించెను


తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు 
ఎదురు కాళ్ళను పుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు


పాలవర్షము కురిసెను అప్పుడా బాలపై చల్లగానే
తడివస్త్రమును విడిచెను  దేవకీ పొడివస్త్రములు గట్టెను


వసుదేవపుత్రుడమ్మా యీ బిడ్డ వైకుంఠవాసుడమ్మా
అడ్డాలలోవేసుకు ఆబాల చక్కదనమును చూసెను


యీబిడ్డ వైకుంఠ వాసుడమ్మా

kastUri raMga raMga maa yanna kAvETi raMga raMga
SrIraMga raMga ninu baasi nEneTlu maracuMduraa

kaMsuNNi saMhariMpa sadguruDu  avataaramettinapuDu 
dEvakIgarbhamunanu kRuShNAvataaramai janmiMcenu

EDu rAtruLLu kalisi  taanugaa Eka raatriga cEsenu
aadivaaramu pUTanu  aShTami dinamaMdu janmiMcenu

talatOTi jananamaitE tanaku bahu mOsaMbu vaccunanucu 
eduru kaaLLanu puTTenu EDuguru daadulanu caMpenapuDu

paalavarShamu kurisenu appuDA baalapai callagaanE
taDivastramunu viDicenu  dEvakI poDivastramulu gaTTenu

vasudEvaputruDammaa yI biDDa vaikuMThavaasuDammaa
aDDAlalOvEsuku aabaala cakkadanamunu cUsenu

yIbiDDa vaikuMTha vaasuDammaa

Wednesday, December 8, 2010

GOPALAKRUSHNUDU




S.JANAKI


ఎంత చక్కని తనయుడే యశోదకిపుడు యెంతచక్కని తనయుడే


కాంతలార మీరు కదలిరారే వేగ కన్నులపండుగగలిగె కౄష్ణుని చూడ


వర్ణించగానూతరమా వాని సోయగము వెడలిచూతము రారమ్మా
మానినులార మనవైకుంఠధాముడు మనల దయచూచుటకు మహినిజన్మించేను


పరిపూర్ణమైన చంద్రుడే పరమాత్ముడే పంకజనాభుడీతడే
పరమపవిత్రుడు పన్నగశయనుడు పంకజాక్షుడు మన యశోదకిపుడు



eMta cakkani tanayuDE yaSOdakipuDu yeMtacakkani tanayuDE


kaaMtalaara mIru kadaliraarE vEga kannulapaMDugagalige kRuShNuni cUDa


varNiMcagaanUtaramaa vaani sOyagamu veDalicUtamu raarammaa
maaninulaara manavaikuMThadhaamuDu manala dayacUcuTaku mahinijanmiMcEnu


paripUrNamaina caMdruDE paramaatmuDE paMkajanaabhuDItaDE
paramapavitruDu pannagaSayanuDu paMkajAkShuDu mana yaSOdakipuDu





Tuesday, December 7, 2010

Monday, November 29, 2010

SAMAVEDA SWARARNAVAMU__BABATAJUDDIN GITANJALI




MARIYAMBIBI MUDDULABIDDADU


మరియంబీబీ ముద్దులబిడ్డడు బాబాతాజుద్దీన్
ధరలో వెలసిన దీనదయాళుడు బాబాతాజుద్దీన్
దివ్యశక్తితో అవతరించిన అద్భుతరూపుడు మా బాబా
నవ్యచరితకే నాందిపలికినది నీఘనతయ్యా ఓబాబా
బాబా బాబా ఓబాబా బాబా బాబా ఓబాబా


జన్మకుపూర్వమె జననికితెలిపెను జన్మరహస్యము ఓబాబా
జగదోధ్ధారక జగద్రక్షకుడు హజ్రత్ తాజుద్దీన్ బాబా
పుట్టినయపుడే జ్ౙానముద్రలో పుట్టినవాడా మాబాబా
పట్టినవారల చేయివిడువక జ్ౙానమునొసగగా రారాదా
ఒంటరితనమున విద్యలుబుధ్ధులు ఎన్నోనేర్చితివి
తుంటరితనముకు తావే లేని బాల్యమయ్యనీది
బస్తరూడవుల భీకరవనములో భక్తితొ సాగిన యవ్వనము
మంత్రతంత్రముల మాయఫకీరుల నంతమొందించునీవైనం
బాబా బాబా ఓబాబా బాబా బాబా ఓబాబా


జ్ఞానముకొరకు నీవు గడిపినది హజ్రత్ బాబామౌలాలీ
జ్ఞానమొసగిరట నీకు గురువులు మద్దీజహానీ
దివ్యజ్యోతివి దివ్యశక్తినే  ఒసగగరారా బాబాజీ
మానవసేవయె మాధవసేవని మరిమరితెలిపిన బాబాజీ
సత్యశోధనము ప్రేమతత్వ్తము పరమాత్ముని పదసన్నిధానము
నిత్యము జనులకు నీవే గురుడై నడిపించవయా మాబాబా
చక్కెరవ్యాధిని ఒక్క ఆకుతో నయమందించిన ధన్వంత్రి
కాళ్ళుకన్నులులేనికబోదికి సర్వమునిచ్చిన సౌమిత్రి
బాబా బాబా ఓబాబా బాబా బాబా ఓబాబా




కౄరజంతువగు మౄగరాజులనే మచ్చిక చేసితివీవయ్యా
కాలసర్పముల వేళ్ళతేళ్ళతో సహజమునగు నీదినచర్య
నవాబుకైనను గరీబుకైనను సంపదనంతయు సరిపంచి
జవాబులేని తీరుపునిచ్చిన న్యాయదేవతవు నీవయ్య
ఆయుక్షీణుల ఆయువు పెంచిన అమరజ్యోతివీ మాబాబా
వండిన చేపలు మిండుజీవులై నిజముగ ఎగురుట నీమహిమ
మరణించిన నీపరిచారకునకు ప్రాణము పోసిన పరమాత్మా నీ
చరణయుగములే నమ్మినవారల కరుణచూపు ఓ దయాకరా
బాబా బాబా ఓబాబా బాబా బాబా ఓబాబా




క్షుద్రశక్తులను ఛిద్రముచేసిన భద్రమూరితివి నీవయ్యా
మానవతను మా మూర్ఖజనులకు మరిమరి తెలుపగ రావయ్యా
నడిసంద్రములో పెనుతుఫానులో నావను నగరము చేసితివి
నీదుమహిమలను ఎన్నని చెప్పను కావగరారా కరుణాద్రి
మానవమతమున మనుజుడవీవై మసలినవాడవు మాబాబా
చిరునవ్వులనే చిందించిన నీమోమును చూపగరారాదా
పరమదయాళు పరులముకాము ప్రార్ధనలందుకురారాదా
పరమేశుడవు దీనుల కావగ దయగన వేగమె రాబాబా
బాబా బాబా ఓబాబా బాబా బాబా ఓబాబా
mariyaMbIbI muddulabiDDaDu baabaataajuddIn
dharalO velasina dInadayALuDu baabaataajuddIn
divyaSaktitO avatariMcina adbhutarUpuDu maa baabaa
navyacaritakE naaMdipalikinadi nIghanatayyaa Obaabaa
baabaa baabaa Obaabaa baabaa baabaa Obaabaa


janmakupUrvame jananikitelipenu janmarahasyamu Obaabaa
jagadOdhdhaaraka jagadrakShakuDu hajrat taajuddIn baabaa
puTTinayapuDE j~jaanamudralO puTTinavaaDA maabaabaa
paTTinavaarala cEyiviDuvaka j~jaanamunosagagaa raaraadaa
oMTaritanamuna vidyalubudhdhulu ennOnErcitivi
tuMTaritanamuku tAvE lEni baalyamayyanIdi
bastaruaDavula BIkaravanamulO bhaktito saagina yavvanamu
maMtrataMtramula maayaphakIrula naMtamoMdiMcunIvainaM
baabaa baabaa Obaabaa baabaa baabaa Obaabaa


j~naanamukoraku nIvu gaDipinadi hajrat baabaamoulaalI
j~naanamosagiraTa nIku guruvulu maddIjahaanI
divyajyOtivi divyaSaktinE  osagagaraaraa baabaajI
maanavasEvaye maadhavasEvani marimaritelipina baabaajI
satyaSOdhanamu prEmatatwtamu paramaatmuni padasannidhaanamu
nityamu janulaku nIvE guruDai naDipiMcavayaa maabaabaa
cakkeravyAdhini okka aakutO nayamaMdiMcina dhanwaMtri
kaaLLukannululEnikabOdiki sarwamuniccina soumitri
baabaa baabaa Obaabaa baabaa baabaa Obaabaa




kRUrajaMtuvagu mRugaraajulanE maccika cEsitivIvayyaa
kaalasarpamula vELLatELLatO sahajamunagu nIdinacarya
navaabukainanu garIbukainanu saMpadanaMtayu saripaMci
javaabulEni tIrupuniccina nyaayadEvatavu nIvayya
AyukShINula aayuvu peMcina amarajyOtivI maabaabaa
vaMDina cEpalu miMDujIvulai nijamuga eguruTa nImahima
maraNiMcina nIparicaarakunaku prANamu pOsina paramaatmaa nI
caraNayugamulE namminavaarala karuNacUpu O dayaakaraa
baabaa baabaa Obaabaa baabaa baabaa Obaabaa




kShudraSaktulanu CidramucEsina bhadramUritivi nIvayyaa
maanavatanu maa mUrKajanulaku marimari telupaga raavayyaa
naDisaMdramulO penutuPAnulO naavanu nagaramu cEsitivi
nIdumahimalanu ennani ceppanu kaavagaraaraa karuNAdri
maanavamatamuna manujuDavIvai masalinavaaDavu maabaabaa
cirunavvulanE ciMdiMcina nImOmunu cUpagaraaraadaa
paramadayaaLu parulamukaamu praardhanalaMdukuraaraadaa
paramESuDavu dInula kaavaga dayagana vEgame raabaabaa
baabaa baabaa Obaabaa baabaa baabaa Obaabaa



Thursday, November 25, 2010

SAMAVEDA SWARARNAVAMU__BABATAJUDDIN GITANJALI




tandanana--tajuddin-baba

తందనాన తందనాన తాజుద్దీన్ బాబా
వందనాలు శతకోటి కాంతినిలయ బాబా
అందలాలు ఎక్కినావు హజ్రత్ బాబా ని-
-న్నందుకోను మాతరమా మొహాలిబాబా


పిలిచినంత ఉన్నానని పలుకునీవట
మతములన్ని ఒకటేనని చాటినావట
నీదుమహిమలెన్నొ ఇలను చూపినావట
మమ్మాదరించిబ్రోచునట్టి స్వామి నీవట


(నీ)నామజపంమించినట్టి మంత్రమేది నిను
కొలువనట్టి మాబ్రతుకనకర్ధమేది
మా పూజలందుకొనగ రార అందరి బాబా నిరు
పేదలను దీనులను ఆదుకోర బాబా



taMdanaana taMdanaana taajuddIn baabaa
vaMdanaalu SatakOTi kaaMtinilaya baabaa
aMdalaalu ekkinaavu hajrat baabaa ni-
-nnaMdukOnu maataramaa mohaalibaabaa


pilicinaMta unnaanani palukunIvaTa
matamulanni okaTEnani caaTinaavaTa
nIdumahimalenno ilanu cUpinAvaTa
mammaadariMcibrOcunaTTi swaami nIvaTa


(nI)naamajapaMmiMcinaTTi maMtramEdi ninu
koluvanaTTi maabratukanakardhamEdi
maa pUjalaMdukonaga raara aMdari baabaa niru
pEdalanu dInulanu AdukOra baabaa

Wednesday, November 17, 2010

GOPALAKRUSNUDU


బంగారుచెంబుతో పన్నీరుపట్టుకు పణతిరుక్మిణివచ్చె మేలుకో
రంగైనపాదాలు చెంగట పూనుకు రమణి సత్య వచ్చె మేలుకో
తెలవారవచ్చేను

దంతకాష్టముపూని తామరసాక్షి సుదంతి వచ్చిందయ్యా మేలుకో
అంతకుమున్ను రుమాళ్ళు పట్టుకు జాంవతి వచ్చింది మేలుకో
తెలవారవచ్చేను

పొందుగ కస్తూరి భరిణె పట్టుకుకాళింది వచ్చిందయ్యా మేలుకో
అందముగానిలువుటద్దముగొని మిత్రవింద వచ్చిందయ్యా మేలుకో
తెలవారవచ్చేను

పంచభక్ష్యాన్నములు పళ్ళెములోవుంచుకు భద్ర వచ్చిందయ్యా మేలుకో
వాలాయముగ తాంబూలము పట్టుకు లక్షణ వచ్చింది మేలుకో
తెలవార వచ్చేను

పొందుగ వీణవాయించుతూ రాకేందురాధ వచ్చిందయ్యా మేలుకో
పదహారువేలస్త్రీలంతా స్వగతాలపాళి తెచ్చున్నారు మేలుకో
తెలవార వచ్చేను


baMgAruceMbutO pannIrupaTTuku paNatirukmiNivacce mElukO
raMgainapaadaalu ceMgaTa pUnuku ramaNi satya vacce mElukO
telavaaravaccEnu

daMtakaaShTamupUni taamarasaakShi sudaMti vacciMdayyaa mElukO
aMtakumunnu rumALLu paTTuku jaaMvati vacciMdi mElukO
telavaaravaccEnu

poMduga kastUri BariNe paTTukukaaLiMdi vacciMdayyaa mElukO
aMdamugaaniluvuTaddamugoni mitraviMda vacciMdayyA mElukO
telavaaravaccEnu

paMcaBakShyaannamulu paLLemulOvuMcuku bhadra vacciMdayyaa mElukO
vaalaayamuga taaMbUlamu paTTuku lakShaNa vacciMdi mElukO
telavaara vaccEnu

poMduga vINavaayiMcutU raakEMduraadha vacciMdayyaa mElukO
padahaaruvElastrIlaMtaa swagataalapaaLi teccunnaaru mElukO


Tuesday, November 9, 2010

SAMAVEDA SWARARNAVAMU--BABA TAJUDDIN GITANJALI




ఓంబాబా తాజుద్దీన్
హజ్రత్ బాబా తాజుద్దీన్
అందరు మొక్కిన తాజుద్దీన్
అందలమెక్కిన తాజుద్దీన్

సద్గురు జయగురు తాజుద్దీన్
పూజనీయుడీ తాజుద్దీన్
కాంప్టినివాసుడు తాజుద్దీన్
కామిత వరదుడు తాజుద్దీన్
పరమార్ధమునే తాజుద్దీన్
పరిపరివిధముల తాజుద్దీన్
భక్తులబోధించి తాజుద్దీన్
ముక్తినొసగునీ తాజుద్దీన్

దైవస్వరూపుడు తాజుద్దీన్
దేవదేవుడీ తాజుద్దీన్
నిశ్చలతత్త్వుడు తాజుద్దీన్
నిష్కామయోగి తాజుద్దీన్
సంపూర్ణరూపుడు తాజుద్దీన్
సుగుణధాముడీ తాజుద్దీన్
కలియుగరాముడు తాజుద్దీన్
కల్కిస్వరూపుడు తాజుద్దీన్

కైవల్యవరదుడు తాజుద్దీన్
కరుణాశ్రితముని తాజుద్దీన్
కొలిచిన భక్తుల తాజుద్దీన్
అండగనిలుచును తాజుద్దీన్
సూక్ష్మము తెలిసిన తాజుద్దీన్
సూత్రధారుడీ తాజుద్దీన్
ధ్యానయోగమున తాజుద్దీన్
జ్ఞానమొసగునట తాజుద్దీన్

సంపూర్ణయోగి తాజుద్దీన్
పరిపూర్ణజ్ఞాని తాజుద్దీన్
దివ్యావతారుడు తాజుద్దీన్
దివ్యేంద్రతేజుడు తాజుద్దీన్
అద్వైతరూపుడు తాజుద్దీన్
ఆత్మస్వరూపుడు తాజుద్దీన్
స్వప్నదర్శనం తాజుద్దీన్
పాపులకొసగును తాజుద్దీన్

భక్తికిముక్తికి తాజుద్దీన్
ప్రేమైకదైవము తాజుద్దీన్
సుజనరక్షకుడు తాజుద్దీన్
కుజనశిక్షకుడు తాజుద్దీన్
నిశ్చలనిర్మల తాజుద్దీన్
నిత్యము సత్యము తాజుద్దీన్
నిఖిలలోకముల తాజుద్దీన్
నిహితాత్మకుడీ తాజుద్దీన్

వివిధరూపముల తాజుద్దీన్
దాతవిధాతయు తాజుద్దీన్
వరములుఒసగెడు తాజుద్దీన్
కరుణామయుడీ తాజుద్దీన్
ఖగమౄగజాతియు తాజుద్దీన్
సర్వప్రాణులును తాజుద్దీన్
నీసౄష్టిరూపాలు తాజుద్దీన్
శక్తికి మహిమలు తాజుద్దీన్

జ్ఞానబోధకుడు తాజుద్దీన్
జ్యోతిస్వరూపుడు తాజుద్దీన్
ఆదర్శరూపుడు తాజుద్దీన్
మార్గదర్శకుడు తాజుద్దీన్
నీనామస్మరణము తాజుద్దీన్
నిత్యతారకము తాజుద్దీన్
నీవేమాకిల తాజుద్దీన్
నిరతముదైవము తాజుద్దీన్


OMbaabaa taajuddIn
hajrat baabaa taajuddIn
aMdaru mokkina taajuddIn
aMdalamekkina taajuddIn

sadguru jayaguru taajuddIn
pUjanIyuDI taajuddIn
kaampTinivaasuDu taajuddIn
kaamita varaduDu taajuddIn
paramaardhamunE taajuddIn
pariparividhamula taajuddIn
bhaktulabOdhiMci taajuddIn
muktinosagunI taajuddIn

daivaswarUpuDu taajuddIn
dEvadEvuDI taajuddIn
niScalatattwuDu taajuddIn
niShkaamayOgi taajuddIn
saMpUrNarUpuDu taajuddIn
suguNadhaamuDI taajuddIn
kaliyugaraamuDu taajuddIn
kalkiswarUpuDu taajuddIn

kaivalyavaraduDu taajuddIn
karuNASritamuni taajuddIn
kolicina bhaktula taajuddIn
aMDaganilucunu taajuddIn
sUkShmamu telisina taajuddIn
sUtradhaaruDI taajuddIn
dhyaanayOgamuna taajuddIn
j~jaanamosagunaTa taajuddIn




saMpUrNayOgi taajuddIn
paripUrNaj~jaani taajuddIn
divyaavataaruDu taajuddIn
divyEMdratEjuDu taajuddIn
advaitarUpuDu taajuddIn
aatmaswarUpuDu taajuddIn
swapnadarSanaM taajuddIn
paapulakosagunu taajuddIn

bhaktikimuktiki taajuddIn
prEmaikadaivamu taajuddIn
sujanarakShakuDu taajuddIn
kujanaSikShakuDu taajuddIn
niScalanirmala taajuddIn
nityamu satyamu taajuddIn
nikhilalOkamula taajuddIn
nihitaatmakuDI taajuddIn

vividharUpamula taajuddIn
daatavidhaatayu taajuddIn
varamuluosageDu taajuddIn
karuNAmayuDI taajuddIn
khagamRugajaatiyu taajuddIn
sarwapraaNulunu taajuddIn
nIsRuShTirUpAlu taajuddIn
Saktiki mahimalu taajuddIn

j~naanabOdhakuDu taajuddIn
jyOtiswarUpuDu taajuddIn
aadarSarUpuDu taajuddIn
maargadarSakuDu taajuddIn
nInaamasmaraNamu taajuddIn
nityataarakamu taajuddIn
nIvEmaakila taajuddIn
niratamudaivamu taajuddIn













Monday, November 8, 2010

ANNAMAYYA SAMKIRTANALU__TODAYAMANGALAM







దేవేశ గణారాధిత దివ్యాంబుజపాదా
శ్రీవేంకటగిరినాయక శ్రీశా హెచ్చరికా
వెంకటేశా హెచ్చరికా

కలిమానుష కలుషాపహా కమనీయ సుదీప్తే
అలమేలుమంగామోహనమూర్తే హెచ్చరికా
మోహనమూర్తే హెచ్చరికా

నారాయణ నరపోషణ నరకాదిసంహరణా
హేరావణమదభంజన ధీరా హెచ్చరికా
రఘువీరా హెచ్చరికా

శ్రీకేశవ నారాయణ గోవిందమురారే గోపాలమురారే
శ్రీమాధవ మధుసూదన దామోదర శౌరే
శేషాచలనిలయా వరభూషామణివలయా
రోషాదివిజయమౌనివిధేయా హెచ్చరికా



రజనీచర వరనాయక బాలా వనమాలా
వ్రజపాలన వరవిజయ గోపాలా హెచ్చరికా
గోవిందా హెచ్చరికా


dEvESa gaNAraadhita divyAMbujapaadaa
SrIvEMkaTagirinaayaka SrISA heccarikA
veMkaTESA heccarikA

kalimaanuSha kaluShApahaa kamanIya sudIptE
alamElumaMgAmOhanamUrtE heccarikaa
mOhanamUrtE heccarikaa

naaraayaNa narapOShaNa narakaadisaMharaNA
hEraavaNamadabhaMjana dhIrA heccarikaa
raghuvIrA heccarikaa

SrIkESava naaraayaNa gOviMdamurArE gOpaalamurArE
SrImaadhava madhusUdana daamOdara SourE
SEShaacalanilayaa varaBUShaamaNivalayaa
rOShAdivijayamounividhEyaa heccarikaa

rajanIcara varanaayaka baalaa vanamaalaa
vrajapaalana varavijaya gOpAlaa heccarikaa
gOviMdA heccarikaa



Saturday, October 30, 2010

ANNAMAYYA SAMKIRTANALU__KALYANAM


SRINIVASA KALYANAM

ధారుణిపతికిని తలబాలో బహు
దారారతునకు తలబాలో

హేమవర్ణునకు ఇందిరాపతికి
దామోదరునకు తలబాలో
సామజభయరక్షకునకు తులసీ
ధామునకు హరికి తలబాలో

కలికి రుక్మిణికి కడుతమకించే
తలదైవమునకు తలబాలో
మలసి సత్యభామకు పతి పంకజ
దళనేత్రునకును తలబాలో

తిరువేంకటమున దినపెండ్లిగల
తరుణులపతికిని తలబాలో
ఇరవుగ బాయక ఇందిరనురమున
ధరియించు హరికి తలబాలో

dhaaruNipatikini talabaalO bahu
daaraaratunaku talabaalO

hEmavarNunaku iMdiraapatiki
daamOdarunaku talabaalO
saamajabhayarakShakunaku tulasI
dhaamunaku hariki talabaalO

kaliki rukmiNiki kaDutamakiMcE
taladaivamunaku talabaalO
malasi satyabhaamaku pati paMkaja
daLanEtrunakunu talabaalO

tiruvEMkaTamuna dinapeMDligala
taruNulapatikini talabaalO
iravuga baayaka iMdiranuramuna
dhariyiMchu hariki talabaalO

Thursday, October 28, 2010

ANNAMAYYA __TODAYA MANGALAM








TODAYAMANGALAM
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకటనాయకా
స్వామి శ్రీ రఘునాయకా
శరణు శరణు హరే హరే
పరమపద గోవింద మాధవ పద్మనాభ జనర్ధనా
ధరణిధరవర గరుడవాహన దైత్యబలిమదభంజన
దాస మానస రంజన
శరణు శరణు హరే

కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతొ మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా

ఆనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా

SaraNu SaraNu suraemdra sannuta Saranu Sreesati vallabhaa
SaraNu raakshasa garva saMhara SaraNu vEMkaTanaayakaa
swAmi SrI raghunaayakaa
SaraNu SaraNu harE harE
paramapada gOviMda maadhava padmanaabha janardhanaa
dharaNidharavara garuDavaahana daityabalimada bhaMjana
daasa maanasa raMjana
SaraNu SaraNu harE

kamaladharuDunu kamalamitruDu kamalaSatruDu putruDu
kramamuto meekoluvu kippuDu kaachinaa rechcharikayaa

Animishaemdrulu munulu dikpatulamara kinnara siddhulu
GhanatatO rambhaadikaamtalu kaachinaa rechcharikayaa

ennagala prahlaada mukhyulu ninnu goluvaga vachchiri
Vinnapamu vinavayya tirupati vaemkaTaachalanaayakaa