SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Wednesday, December 31, 2014

Audio Link : Kodekadu gadavamma Govindaraju

కోడెకాడు గదవమ్మ గోవిందరాజు
వేడుక మోవులతేనె విందారగించీని

కొలువు కూటములోన గోవిందరాజు వాడే
పలుమారు జెలులతో బందేలాడీని
నిలువుల మేడమీద నిలిచి గోవిందరాజు
వలపులు చల్లుచును వసంతాలాడీని

కోరి కేళాకూళిలోన గోవిందరాజు వాడే
సారె నింతులతో నీరు చల్లులాడీని
తూరుచు సింగారపు దోటలో గోవిందరాజు
సైరణ లేకందరితో జాజరలాడీని

గోముల శ్రీ వేంకటాద్రి గోవిందరాజు వాడె
రామలతోడుతను సరసమాడీని
గామిడై పానుపు పై గూడి కందువగోవిందరాజు
మోములు చూచందరితో ముచ్చటలాడీని

 kODekaaDu gadavamma gOviMdaraaju
vaeDuka mOvulataene viMdaaragiMcheeni

koluvu kooTamulOna gOviMdaraaju vaaDae
palumaaru jelulatO baMdaelaaDeeni
niluvula maeDameeda nilichi gOviMdaraaju
valapulu challuchunu vasaMtaalaaDeeni

kOri kaeLaakooLilOna gOviMdaraaju vaaDae
saare niMtulatO neeru challulaaDeeni
tooruchu siMgaarapu dOTalO gOviMdaraaju
sairaNa laekaMdaritO jaajaralaaDeeni

gOmula Sree vaeMkaTaadri gOviMdaraaju vaaDe
raamalatODutanu sarasamaaDeeni
gaamiDai paanupu pai gooDi kaMduvagOviMdaraaju
mOmulu choochaMdaritO muchchaTalaaDeeni

Friday, December 12, 2014

నాద యోగికి నివాళి !


నాద యోగికి నివాళి !
-------
ప|| ఇన్నిచదువనేల ఇంత వెదకనేల | కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||
చ|| పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను |
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||
-------
సద్గురువులు, విద్వాంసులు, కళాకారులు వీరికొక ప్రత్యేకత ఉంది. వీరు మరణించినా వారి వారి చిహ్నాలు ఈ ధరిత్రి మీద మరి కొంత కాలం జీవించి ఉంటాయి. గురువు ద్వారా జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న శిష్యపరంపర గురువు పేరుని బ్రతికిస్తూ ఉంటుంది. త్యాగరాజ స్వామి పరంపర ఉదాహరణ. విద్వాంసుడి విద్వత్తు, కళాకారుడు సృష్టించిన కళాఖండాలు వారిని సజీవంగా ఉంచుతాయి.
సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు సద్గురువు , మహా విద్వాంసుడు & గొప్ప కళాకారుడు.
తెల్లాటి పంచె, లాల్చి , నుదుట విభూది రేఖలు, ముఖాన సరస్వతి కళ , గంభీరమైన గాత్రము చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించే గురువుగారిని కొన్ని సార్లు దర్శించే భాగ్యం నాకు కలిగింది. తాళ్ళాపాక లో జరిగిన అన్నమయ్య 600 వ జయంతి లో ఆయన ఆలపించిన సకల శాఇంతి కరము సర్వేశ కీర్తన పల్లవి నాకు గుర్తు. కర్ణాటక సంగీతంలో తెలుగు వారి కీర్తి పతాకలు చాటిన మహా విద్వాంసులలో నేదునూరి గారు అగ్ర స్థానంలో ఉంటారు. ఆయన నిర్యాణ వార్త విని ఆంధ్ర రాష్త్రంలో కంటే తమిళనాట బాధ పడేవారు ఎక్కువ ఉంటారంటె అతిశయోక్తి కాదు.
కొన్ని వేల కచేరిలు భారతదేశంలో , ఇతర దేశాలలో ఇచ్చి ఎన్నో బిరుదులు పొందిన సంగీత విద్యా భాస్కరుడు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి. ఒకసారి ఇంటర్వూ లో నేదునూరి గారు చెప్పినట్టు గుర్తు , ఇన్ని కచేరీలలో వచ్చిన పేరు కంటే , అన్నమాచార్య కీర్తనలకు ఈయన కూర్చిన స్వరాలు మరింత ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అన్నమాచార్య కీర్తనాల మీద స్వతహాగా ఉన్న మక్కువ వలన నాకు, ఆ కీర్తనలకు రాగాన్ని కట్టి ప్రాణం పోసే సంగీతజ్ఞులు అంటే నాకు భక్తి, గౌరవం. ఆ విధంగా నాకు నేదునూరి గారు, సంగీత విద్వాసుడి కంటే , అన్నమాచార్య కీర్తనల స్వర కర్త గా ఎక్కువ పరిచయం. నేదునూరి కృష్ణమూర్తి గారి పేరు తెలియకపోయినా , ఆయన స్వరపరిచిన కీర్తనలు (నానాటి బ్రతుకు, ముద్దుగారే యశోద, భావము లోన, ఇట్టి ముద్దులాడి, ఒకపరికొకపరి, పలుకు తేనెల తల్లి) వినని వెంకన్న భక్తుడు ఉండడేమో ! తమిళనాట పెళ్ళిళ్ళల్లో కూడ నానాటి బ్రతుకు సన్నాయి వాయిస్తూ ఉంటారు. ఈ ఒక్క సంకీర్తన చాలు ఆయన్ని సంగీత కళానిధిని చేయటానికి అని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఒక సభలో అన్నారు. నేదునూరి గారు స్వరపరిచిన 108+ అన్నమాచార్య కీర్త్నలలొ , ప్రతి ఒక్కటి ఒక్కో ఆణిముత్యం. చిక్కటి సంగీతంతో అన్నమయ్య సాహిత్యం లోని భక్తి భావాన్ని, వేంకటేశ్వర తత్వాన్ని కర్ణ రంజకమైన రాగాలలో మనసుకు చేరవేసే విధంగా ఉంటాయి. ఈ సాహిత్యానికి ఇంతకంటె నప్పే స్వర కూర్పు అసాధ్యమనిపించేవిధంగా ఉంటాయి కొన్ని పాటలు. నేదునూరి గారు స్వరపరిచిన కొన్ని కీర్తనలు నా బ్లాగు లో సేకరించాను. ఎమ్మెస్ అమ్మ పాడిన బాలాజి పంచరత్న మాలలో సింహభాగం నేదునూరి గారు స్వరపరిచినవే. స్వర కర్త గా నేదునూరి గారి స్థాయి ని గొప్పదనాన్ని ఆవిష్కరించే మరొక కీర్తన  'తెలిసితే మోక్షము ' నాకు చాలా ఇష్టం.
శరణు శరణు సురేంద్ర సన్నుతరామచంద్రుడితదురామభద్ర రఘువీరసకల శాంతికరమువెనకేదో ముందరేదొఇన్ని చదువానేల , ఆదిదేవ పరమాత్మపలు విచారములేల , పురుషోత్తముడ వీవుతెలిసితే మోక్షము , అవధారు రఘుపతి, అదె చూదరే, అలర చంచలమైన : నేదునూరి గారు స్వరపరిచిన మరికొన్ని సంకీర్తనా కుసుమాలు.

వేంకటేశ్వరుడికి అన్నమయ్య కట్టిన పదాల కోవెల లో , రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గార్లు ప్రాకారాలైతె , పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు , కామిశెట్టి శ్రీనివాసులు గారు నిలబెట్టిన గరుడ ద్వజం నేదునూరి గారు. ఆ ద్వజం మీదున్న 108 సంకీర్తన స్వర దీపాలు అజ్ఞాన తిమిరాలోనున్న భక్తులను ఆకర్షిస్తూ నిజమైన జ్ఞానానికి దారిని చూపిస్తుంటాయి.

మరొక తెలుగు వాగ్గేయకారుడైన భద్రాచల రామదాసు రచించిన కీర్తనలకి స్వరాలు కట్టి గురువుగారు మన తెలుగు జాతి కి వెలకట్టలేని నిధిని ఇచ్చి వెళ్ళారు. శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్పూర్థి తో 2006 లో ప్రారంభమైన రామదాసుజయంత్యోత్సవాలు వారి శిష్యులు భద్రాద్రి లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వెబ్సైటు లో నేదునూరి గారు స్వరపరిచిన/పాడిన కొన్ని రామదాసు కీర్తనలు వినవచ్చు. ఈ ఉత్సవాలలో పాల్గొని ఆయన కూర్చిన కీర్తనలు పాడుకోవటం ఆయనకు మనమిచ్చే ఘన నివాళి. ఆయన ప్రాచుర్యం చేసిన ఏమయ్య రామ కీర్తన ఎక్కువగా కచేరిలలో వినిపిస్తూ ఉంటుంది. శ్రీ రామ నామమే, శ్రీరాముల దివ్య నామ, హరి హరి రామ, కంటి నేడు మా రాముల , గురువుగారు స్వరపరిచిన మరికొన్ని ప్రాచురం పొందిన రామదాసు కీర్తనలు.

సంగీత ప్రపంచంలో ఒక ధృవతార భూమిని వదిలి వెంకన్న పాదాల చెంతకు చేరింది. ఆయనకు ప్రదానం చేసిన "సంగీత కళానిధి" కి విలువ పెరిగింది, ఆయనకు దక్కని పద్మాలు , (వి)భూషణాలు కుంచించుకుపోయి మరింత వెలిగే అవకాశాన్ని కోల్పోయినాయి. ఈ కలియుగంలో తిరుమల కొండ పై వేంకటేశ్వరుడి భక్తులు ఉన్నంతవరకు , అన్నమయ్య పదాలు , ఎమ్మెస్ అమ్మ గళం , నేదునూరి స్వరాలు తెలుగునాట ప్రతిధ్వనిస్తూనే ఉంతాయి. ఆ మహాగురువు శిష్యులకు ఆ శైలిని కాపాడి, స్వరాలను ప్రాచుర్యం చేసి భవిష్యత్తరాలకు అందజేసే శక్తిని ఇవ్వాలని ఆ ఏడుకొండల వాదిని ప్రార్ధిస్తూ , నాదయోగికి నమస్కారాలతో వీడ్కోలు.


                                                   || సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ
Mangalasutramokkate maganaliki

మంగళసూత్ర మొక్కటే మగనాలికిఁ గట్టేది
అంగవించే మీఁదిపన్నులన్నియు విభునివే


తలఁపులోపల నిన్నుఁ దలఁచినానుఁ గలవు
తలఁచకున్నా నంతరాత్మవై కలవు
పలుపూజ లిఁకనేల భక్తిసేయనేల నీవు
గలవని నమ్మేదొక్కటే బుద్ధిగాకా


మొక్కినా రక్షింతువు మొక్కకున్నా జగములో
యిక్కువతో రక్షింతువు యెపుడు నీవు
పెక్కు విన్నపాలేల పిలిచి యలయనేల
తక్కక నమ్మేటిది నీదాస్య మొక్కటే


కడుసుజ్ఞానినైనా నీగర్భవాసమే వునికి
వెడ నజ్ఞానినైనాను విడిదక్కడే
బడినే శ్రీవేంకటేశ పలునావుద్యోగాలేల
నిడివి నిన్ను నుతించేనేమమే నాది


maMgaLasootra mokkaTae maganaaliki@M gaTTaedi
aMgaviMchae mee@Mdipannulanniyu vibhunivae

tala@MpulOpala ninnu@M dala@Mchinaanu@M galavu
tala@Mchakunnaa naMtaraatmavai kalavu
palupooja li@Mkanaela bhaktisaeyanaela neevu
galavani nammaedokkaTae buddhigaakaa

mokkinaa rakshiMtuvu mokkakunnaa jagamulO
yikkuvatO rakshiMtuvu yepuDu neevu
pekku vinnapaalaela pilichi yalayanaela
takkaka nammaeTidi needaasya mokkaTae

kaDusuj~naaninainaa neegarbhavaasamae vuniki
veDa naj~naaninainaanu viDidakkaDae
baDinae SreevaeMkaTaeSa palunaavudyOgaalaela
niDivi ninnu nutiMchaenaemamae naadi

Monday, July 14, 2014

Annamayya Sankirtana

Audio Link - TaneTeliyavale


ప|| తానే తెలియవలె తలచి దేహి తన్ను | మానుపువారలు మరి వేరీ ||
చ|| కడలేనిభవసాగరము చొచ్చినతన్ను | వెడలించువారలు వేరీ |
కడుబంధములచేత గట్టుపడినతన్ను | విడిపించువారలు వేరీ ||

చ|| కాగినినుమువంటి కర్మపుతలమోపు- | వేగు దించేటివారు వేరీ |
మూగినమోహపుమూకలు తొడిబడ | వీగదోలేటి వారలువేరీ ||

చ|| తిరువేంకటాచలాధిపుని గొలువుమని | వెరవుచెప్పెడువారు వేరీ |
పరివోనిదురితకూపముల బడకుమని | వెరవుచెప్పెడివారు వేరీ ||


pa|| tAnE teliyavale talaci dEhi tannu | mAnupuvAralu mari vErI ||
ca|| kaDalEniBavasAgaramu coccinatannu | veDaliMcuvAralu vErI |
kaDubaMdhamulacEta gaTTupaDinatannu | viDipiMcuvAralu vErI ||

ca|| kAgininumuvaMTi karmaputalamOpu- | vEgu diMcETivAru vErI |
mUginamOhapumUkalu toDibaDa | vIgadOlETi vAraluvErI ||

ca|| tiruvEMkaTAcalAdhipuni goluvumani | veravuceppeDuvAru vErI |
parivOniduritakUpamula baDakumani | veravuceppeDivAru vErI

Annamayya Sankirtana

AUDIO LINK - KANTIKANTIMIDE


కంటిఁగంటి మిదె కలిగె మాపాలిట
యింటి వేలుపై యేలీ వీడె

శ్రీనరసింహుడు చిన్మయ రూపుడు

నానామహిమల నాటరుఁ(కుఁ)డు
దానవాంతకుడు దైవశిఖామణి
పూని యహోబలపురపతి వీడే

పరమ పూరుషుడు ప్రహ్లాదవరదుడు

హరి లోకోన్నతుఁ డనంతుడు
దురిత విదారుడు దుష్టభంజకుడు
సిరుల నహోబలశ్రీపతి వీడే

చెలువుడు వరదుడు జీవాంతరాత్ముడు

నిలిచె శ్రీవేంకట నిధియందు
బలువుడు సులభుడు భక్తరక్షకుడు
లలి నహోబలవిలాసుడు వీడే

kaMTi@MgaMTi mide kalige mApAliTa
yiMTi vElupai yElI vIDe

SrInarasiMhuDu chinmaya rUpuDu
nAnAmahimala nATaru@M(ku@M)Du
dAnavAMtakuDu daivaSikhAmaNi
pUni yahObalapurapati vIDE

parama pUrushuDu prahlAdavaraduDu
hari lOkOnnatu@M DanaMtuDu
durita vidAruDu dushTabhaMjakuDu
sirula nahObalaSrIpati vIDE

cheluvuDu varaduDu jIvAMtarAtmuDu
niliche SrIvEMkaTa nidhiyaMdu
baluvuDu sulabhuDu bhaktarakshakuDu
lali nahObalavilAsuDu vIDE

Annamayya Sankirtana


Audio Link NEEVEKKUDO



నీవెక్కుడో ఆపె నీకంటె నెక్కుడో
రావయ్య తిరుపతి రఘురామచంద్ర

తుమురుగ దనుజులఁ దోలి తొప్పర లాడి
అమరఁగ గెలిచితి నందుపు(వు?)
మమతతోడుత నిన్ను మదనయుద్ధమునందు
రమణి నిన్ను గెలిచె రఘురామచంద్ర

తవిలి శివుడు కాశిఁ దారక బ్రహ్మమని
యివల నిన్నుపదేశ మియ్యగా
నవమై శ్రీవేంకటనాథ మరుతంత్రము
రవళి నీకీపె యిచ్చె రఘురామచంద్ర

nIvekkuDO Ape nIkaMTe nekkuDO
rAvayya tirupati raghurAmachaMdra

tumuruga danujula@M dOli toppara lADi
amara@Mga gelichiti naMdupu(vu?)
mamatatODuta ninnu madanayuddhamunaMdu
ramaNi ninnu geliche raghurAmachaMdra

tavili SivuDu kASi@M dAraka brahmamani
yivala ninnupadESa miyyagA
navamai SrIvEMkaTanAtha marutaMtramu
ravaLi nIkIpe yichche raghurAmachaMdra

Annamayya Sankirtana - Tatvagnanamu

Wednesday, July 2, 2014

Krishnamayya Simhagir Vacahanaalu

  తొలిసంకీర్తనాచార్యుడుక్రిష్ణమయ్య.బ్లాగ్ స్పాట్.ఇన్ మరియు శ్రీ వినుకొండ మురళీకృష్ణ గారికి ఎన్నో ధన్యవాదములు తెలుపుతూ ఈ విషయం ప్రపంచమంతా తెలియజెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఇక్కడ పొందు పరచడమైనది.  వారికి ఏమైన అభ్యంతరమున్నచో రిమూవ్ చెయ్యబడును.
తొలి తెలుగు పదకర్త క్రిష్ణమయ్య -ఒక చారిత్రిక సత్యం        


   మరుగున పడిన మాణిక్యం ,పరమ భక్తుడైన ఒక మహాపురుషుడు గురించిన చారిత్రిక సత్యం క్రుష్ణమయ్య ఫౌండేషన్ (విశాఖపట్నం)  అద్యక్షులు ,సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త డా.పూసపాటి ఆనంద గజపతి రాజు(ఆంధ్రప్రదేశ్ మాజీ ఆరోగ్య,విద్యాశాఖల అమాత్యులు) మీ ముందు ఆవిష్కరిస్తున్నారు.
                              ఓం శ్రీ రామ 




         తొలి తెలుగు పదకర్త క్రిష్ణమయ్య -ఒక చారిత్రిక సత్యం
                                                                          ---------------------------
               ` వేదంబు తెనుగు గావించి సంసార ఖేదంబును  పోగొట్టిన తెలుగు వేద ద్రష్ట' అని అన్నమయ్య మనుమడు చిన్నన్న క్రిష్ణమయ్యను పేర్కొంటూ తమ సంకీర్తనల ద్వారా క్రిష్ణమయ్య ``ఆంధ్ర వేదాంత కర్త'గా `పంచమాగమ సార్వభౌములు 'గా కీర్తించారు.
                  ప్రఖ్యాత కవి,రచయిత ఆరుద్ర తమ `సమగ్రాంధ్ర చరిత్ర'లో క్రిష్ణమయ్య ను` సంకీర్తనానికి మార్గదర్సకుడి'గా పేర్కొన్నారు.
                                 ఎవరీ క్రిష్ణమయ్య?
క్రిష్ణమయ్య  మరుగున పడిన ఒక మాణిక్యం!.ఒక మహాపురుషుడు !ఒక మహితాత్ముడు!
  సింహాచలం  లొ వెలసిన  శ్రీ  వరాహలక్ష్మీ  నరసింహస్వామి  పరమ భక్తుడు  ,అన్నమయ్యలాంటి సంకీర్తనాచార్యులకు,పోతన వంటి  భాగవతొత్తములకు స్ఫూర్తినిచ్చిన వాగ్గెయకారుడు.వారికంటే  ప్రాచీనుడు.ఇదికల్పిత గాధ కాదు,చారిత్రిక సత్యం. తెలుగువారు గర్వించదగ్గ  సాంస్క్రుతిక వారసత్వం.
దక్షిణాది సంగీత చరిత్రలో ఈ ఆవిష్కరణ ఒక నూతన అధ్యాయానికి  తెర తీస్తోంది!
భక్తీ సంగీత చరిత్రలో ఈ ఆవిష్కరణ ఆనందాశ్చర్యాలతో కూడిన ఒక చర్చకు దారితీస్తోంది!
ఇది కల్పిత కధ కాదు!చారిత్రిక సాక్ష్యాధారాలున్నఒక సంకీర్తనాచార్యుని  జీవితగాధ!

.కృష్ణమయ్య  ఆళ్వారు శ్రేణికి చెందిన తెలుగులో మొదటి  పద కవితాచార్యుడు.భగవద్ శ్రీ రామానుజాచార్యుల్ని అధ్యయనం చేసిన అసలైన వైష్ణవపండితుడు.
వారి   ద్వారానే భగవద్ రామానుజాచార్యులు భగవదనుగ్రహం పొందగాలిగేరన్నది చారిత్రిక సత్యం!
వారి గానానికి వశుడై  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి భూమిలో కూరుకు పోయిన పాదాలు గలవాడు ,ఎగిరి నృత్యం చేసాడట!ఇది మరో చారిత్రిక సత్యం!
                 క్రిష్ణమయ్య పూర్తి పేరు శ్రీకాంత కృష్ణమాచార్యులు  క్రీ.శ.  1295 నుండి క్రి.శ.1323 మధ్య కాలంలో ఓరుగల్లును రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలానికి చెందిన వాడు. ` ప్రతాప చరిత్ర 'సిద్దేశ్వర చరిత్ర'తిరగవేస్తే ఈయన జీవితం కనిపిస్తుంది.క్రిష్ణమయ్య  తన `జన్మ సంకీర్తన' లో తాను `తారణ' నామ  సంవత్సరం,భాద్రపద కృష్ణ చతుర్దశి ,మంగళ వారం నాడు  జ్యేష్టా నక్షత్రములో   సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ,తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ ,ఆయన  ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు ..  క్రిష్ణమయ్య సంకీర్తనం చేస్తూ ఉంటే  నరసింహస్వామి బాలుని రూపం లో వచ్చి నాట్యం చేసేవారని ప్రతీతి. క్రిష్ణమయ్య వయసు వచ్చాక తన మహిమలతో ప్రజలని దిగ్భ్రాంతుల్ని చేసి`పదకొండవ అవతారుని'గా కొనియాడబడినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒక పదంలో క్రిష్ణమయ్యే `తాను ఒక పదకొండవ అవతారాన్నని విజ్ఞప్తి చేసాడు ఎంత గుండె ధైర్యం కావాలి?కోపోద్రిక్తమైన అవతారాన్ని ఆజ్ఞాపించిన భక్తుడు క్రిష్ణమయ్య. ప్రతాపరుద్ర చక్రవర్తి ఆస్థానంలో వ్రాయసకారుడిగా ఉన్నప్పుడు క్రిష్ణమయ్య సింహాద్రి నరసింహుని స్తుతిస్తూ  గానం చేస్తే కనక వర్షం కురిసిందని చారిత్రిక ఆధారాల  ద్వారా తెలుస్తోంది.సన్నిధి ఆళ్వారులలో ఇంతటి ప్రజ్ఞావంతుడు మనకి కనిపించడన్నది అక్షర సత్యం.
              .ఈయన .వేదపండితుడు.పదాలలో ఛందస్సు శృంఖలాలను విసర్జించి ,భావాలకి విశృంఖల సోయగాలను అందించిన భాషా విప్లవ వాది. క్రిష్ణమయ్య సింహగిరినరహరి  ఆదేశంతో,అనుగ్రహంతో  స్వామిని  స్తుతిస్తూ `సింహగిరి వచనాలు'అనే పేరిట నాలుగు లక్షల కీర్తనలతో వాక్పూజ చేసి వాటిని రాగి రేకులపై నిక్షిప్తం చేసి సింహాచలేశునికి   సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది.వాటిలో చాలామట్టుకు పారిస్ లోని కింగ్స్ లైబ్రరీ కి తరలించినట్టు చారిత్రిక ఆధారాలున్నాయి.తంజావూరు సరస్వతీమహల్ లో రెండువందల దాకా కీర్తనలు లభ్యం అయ్యాయి,మిగతావి ఏ అంధకార బిలం లోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.
                     క్రిష్ణమయ్య రచన ,సంగీతం,నాట్యం ,భక్తి గల బహుముఖ ప్రజ్ఞాశాలి ,.ప్రతిభావంతుడు అన్నింటికీ మించి అభ్యుదయవాద.వచన రచన చేయడం,మాల దాసర్లతో సహపంక్తి భోజనం చేయడం,దేవదాసీ కాంతలతో సహవాసం చేస్తూ ,భక్తీ గీతాలు పాడుతూ నాట్యం చేయడం ,నాటి మూఢ ఆచారాలను అతిక్రమించడం ,చాందస ఆచార్యులను ఎదిరించడం కులమత బేధాలను పాటించకపోవడం వంటివి ఎన్నో అభ్యుదయ భావాలు కృష్ణమయ్య రూపు రేఖలు.వారి కృతుల సారాంశం కూడా ఇదే!. పురాణ ,ఇతిహాసిక గాధలు సంస్కృత భాషలో వ్రాయబడిన కావ్యాలుగా స్థిరపడిపోయాయి.సంస్కృతంలో వ్రాసిందే కావ్యంగా ప్రసిద్ధికెక్కింది.ఆ రకంగానే సంస్కృతంలో రచించిన కావ్యాలూ ,దైవం కూడా సామాన్య జనానికి దూరం అయిపోతూ వచ్చాయేకాని ,సన్నిహితం కాలేకపోయాయి.ఆ కావ్యాలు ప్రజలకి అందుబాటులో ఉండాలనీ ,భక్తి భావం సామాన్య జనానికి అందించాలనే సత్సంకల్పంతో ,సంసార ఖేదాలని రూపుమాపటానికి కంకణం కట్టుకుని క్రిష్ణమయ్య వేదాలనీ ,ఉపనిషత్ సారాన్ని తెలుగులో తేలికైన మాటలతో వచన రచన చేసి సంగీత,నాట్య శాస్త్రాలని మిళితం చేసి సామాన్య జనానికి అర్ధం అయ్యే రీతిలో గానం చేసి ప్రదర్శించేవారు. కృష్ణమయ్య ది జానపద విలక్షణమైన పధ్ధతి.పాండిత్య ప్రకర్ష తక్కువగాను ,జనాకర్షణ ప్రక్రియ ఎక్కువగాను కనిపిస్తుంది.ఈయన పామర భాషలో భక్తిని అందించి ,వారిలో ధర్మ ప్రవర్తనను పెంపొందించడం అసామాన్యమైనది.అయితే భాషా ,భావాల్లోని వైప్లవ్యమే ఇతని పాలిటి శాపమైంది.ఇంతటి బహుముఖప్రజ్ఞాశాలిని వైష్ణవ ఛాందసులు ఒక అనాచార్యుడిగాను ,భ్రష్టాచారిగాను ముద్ర వేసి వైష్ణవం నుండి వెలివేయడం అన్నది ఒక్క వీరి పాలిట శాపమే కాదు యావత్ వైష్ణవ లోకానికీ శాపమైంది.
                      అన్నమయ్య పన్నెండు సంవత్సరాలు సింహాచలం లో నివసించి గురు  శుశ్రూష చేసిన అనంతరం తిరుపతి వెళ్లి సంకీర్తనల రచన ప్రారంభించినట్టు  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన అన్నమయ్య చరిత్రద్వారా తెలుస్తోంది.అన్నమయ్య సింహాచలం లో ఉన్నప్పుడే  క్రిష్ణమయ్య సంకీర్తనలవల్ల ప్రభావితం అయి ఆయన అందించిన స్ఫూర్తితో  సంకీర్తల రచన చేసినట్టు మనకు విదితమవుతోంది, ఇందుకు రెండు క్రిష్ణమయ్య కీర్తనలని ఉదాహరణలుగా ఈ దిగువ ఇవ్వబడ్డాయి.
దేవా!
   విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటే  హరికీర్తనము జేయునతడే కులజుండు .
   శ్వపచుండైననేమి?ఏ వర్ణంబైన నేమి? ద్విజునికంటే నతడే కులజుండు.........
    (అన్నమయ్య కీర్తన-ఏ కులజుండైన నేమి?)
దేవా!
గంగోద్బవమైన మీ దివ్య శ్రీపాద యుగళమ్ము గంటి..........
ఇంద్రాది దిక్పతులు మిమ్ము సేవింపగా  గంటి 
కనకపీతాంబర ప్రభావమ్ము గంటి ............
(అన్నమయ్య కీర్తన -ఇప్పుడిటు కలగంటి )
                క్రిష్ణమయ్య అందించిన స్ఫూర్తి తో అన్నమయ్య వేల వేల పదాలు రాస్తే క్రిష్ణమయ్య లక్షలాది పదాలు కూర్పు చేసాడు .రాగిరేకులలో నిక్షిప్తం చేసాడు..అయితే అన్నమయ్య పదాలు వెలుగు చూసాయి .ఇతగాడివి ఇంకా ఏ అంధకార బిలంలోనో అజ్ఞాతవాసం చేస్తున్నాయి.క్రిష్ణమయ్య ఏ కాలంవాడో,అతని సమకాలికులెవరో,అతని రచనలు ఏమయ్యాయో అన్న విషయాలపై  చాలా పరిశోధనలు జరగాల్సిన ఆవశ్యకత వుంది.
   వీరి ప్రజ్ఞాపాటవాలని  వెలుగులోకి తేవాలని చేస్తున్న  ప్రయత్నాల ఫలితంగా సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త డా.పూసపాటిఆనంద గజపతి రాజుగారి అద్యక్షతన విశాఖపట్నం లో  `కృష్ణమయ్య  ఫౌండేషన్' ఆవిర్భవించింది.ఈ ఫౌండేషన్ కృష్ణమయ్య జీవితం ,ఆయన వాంగ్మయం ప్రాచుర్యం లోకి తెచ్చే ప్రయత్నాలలో  భాగంగా ఆయన జీవిత చరిత్ర,వాంగ్మయం  ప్రచురించడం,ఆయన సంకీర్తనలని నేర్పించి,పాడించి రికార్డు చేయడం,భారత  దేశంలోనే కాకుండా అమెరికా,బ్రిటన్ ,కెనడా వంటి దేశాలలో క్రిష్ణమయ్య సంకీర్తనల కచేరీలు,నృత్య  ప్రదర్సనలుఏర్పాటు చేయడం  సదస్సులు నిర్వహించడం ,కృష్ణమయ్య   జీవితం వాంగ్మయం  కి సంబంధించిన న పరిశోధకులని  ప్రోత్సహించడం  ,షార్ట్  ఫిలిం,t.v సీరియల్ నిర్మించడం మొదలైన  కార్యక్రమాలని చేపడుతోంది .తెలుగువారి సాంస్కృతిక వారసత్వం నిలబెట్టడానికి యావత్ప్రపంచంలోని తెలుగువారి సహాయ సహకారాలని అర్ధిస్తూ 
                                                                                                                                                         భవదీయుడు
                                                                                                                                                వినుకొండ మురళీ మోహన్
                                                                                                                                                           సంచాలకుడు
                                                                                                                                                 క్రిష్ణమయ్య ప్రాజెక్ట్ ,విశాఖపట్నం 
మరిన్ని వివరాలకోసం,కృష్ణమయ్య కీర్తనలు వినడంకోసం మా బ్లాగ్ చూడవచ్చు                          e mail i.d;krishnamayyafoundation@gmail.com




Friday, June 6, 2014

Annamayya Sankirtana

Audio Link: Chelle chelle G.V.Anilkumar

చెల్లెఁ జెల్లె నీచేత శింగరి నీ
వుల్లమెల్లఁ దక్కఁ గొంటినో శింగరి

చిక్కని నీనవ్వుచూచి శింగరి నే

నొక్కటై నీకు మొక్కితినో శింగరి
చెక్కులఁ జెమటగారె శింగరి నీ
వుక్కుగోరు సోకనీ

కు వో శింగరి

చిరుత నిట్టూర్పుల శింగరి నిను

నొరసీబో నాకు చాలు వో శింగరి
సిరుల నిట్టమాపు శింగరి నీ
వొరపు నాచేతఁ జిక్కెనో శింగరి

చేవదేరె నోమోవి శింగరి నే

నోవరిలోఁ గూడగానె వో శింగరి
శ్రీవేంకటాద్రి మీద శింగరి
వోవమన సిగ్గుదేరెనో శింగరి.

chelle@M jelle nIchEta SiMgari nI
vullamella@M dakka@M goMTinO SiMgari

chikkani nInavvuchUchi Simgari nE
nokkaTai nIku mokkitinO SiMgari
chekkula@M jemaTagAre SiMgari nI
vukkugOru sOkanIku vO SiMgari

chiruta niTTUrpula SiMgari ninu
norasIbO nAku chAlu vO SiMgari
sirula niTTamApu SiMgari nI
vorapu nAchEta@M jikkenO Simgari

chEvadEre nOmOvi Simgari nE
nOvarilO@M gUDagAne vO Simgari
SrIvEMkaTAdri mIda Simgari
vOvamana siggudErenO Simgari

YouTube link : G AnilaKumar

Wednesday, April 23, 2014

Narasimha Sankirtana


నృసింహ సంకిర్తన సాహిత్యం గానం సామవేదం వేంకట మురళీకృష్ణ
605వ అన్నమాచార్య జయంతినాడు శ్రీశ్రీశ్రీ వరద వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో హరిశరణాగతి మండలి అధ్వర్యంలో జరిగిన 605వ అన్నమాచార్య జయంతి ఉత్సవంలో ఆలపించినది.
 Audio Link -
Narasimha sankirtana by Samavedam Venkata Murali Krishna