trivikrama-murthiyaina
త్రివిక్రమమూర్తియైన దేవునివలెనున్నాడు
భువిసేవించే వారి పాలి పుణ్యఫల మీతడు
అంచె నుదయాస్త గిరులందు నొకజంగ చాచి
వంచిచక మిన్ను దాకా వాలమెత్తి
ముంచి బ్రహ్మలోకము మోవగఁ బ్రతాపమున
పెంచినాడు తన మేను పెద్ద హనుమంతుడు
తిరముగ హస్తములు దిక్కులు నిండఁ బరపి
వరుస కర్ణములిరు వంకఁ జిక్కించి
దుర దుర మస్తకము ధ్రువ మండలము సోక
పెరిగినాడుఇదివో పెద్ద హనుమంతుడు
అక్కజపు రోమములన్ని లోకములొరయ
మొక్కుచు శ్రీ వెంకటేశు మోహపు బంటై
పక్కన నజాండ కప్పరము నిండా తాను
పిక్కిటిల్లినాడిదివో పెద్ద హనుమంతుడు
trivikramamoortiyaina daevunivalenunnaaDu
bhuvisaeviMchae vaari paali puNyaphala meetaDu
aMche nudayaasta girulaMdu nokajaMga chaachi
vaMchichaka minnu daakaa vaalametti
muMchi brahmalOkamu mOvaga@M brataapamuna
peMchinaaDu tana maenu pedda hanumaMtuDu
tiramuga hastamulu dikkulu niMDa@M barapi
varusa karNamuliru vaMka@M jikkiMchi
dura dura mastakamu dhruva maMDalamu sOka
periginaaDuidivO pedda hanumaMtuDu
akkajapu rOmamulanni lOkamuloraya
mokkuchu Sree veMkaTaeSu mOhapu baMTai
pakkana najaaMDa kapparamu niMDaa taanu
pikkiTillinaaDidivO pedda hanumaMtuDu
Audio Archive link: (.wma file , download to listen)
KaadannaVarikiBalahamsaSaiCharanకాదన్న వారికి వారికర్మమే సాక్షియేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి
వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమైఆదటఁ దెచ్చి నిలిపె నది సాక్షిఆదిఁ గర్మములు సత్యమౌటకు బ్రహ్మాయగానపోదితో నీతడు యజ్ఞభోక్తౌటే సాక్షి
అదె బ్రహ్మము సాకారమౌటకు పురుషసూక్త-మెదుట విశ్వరూపము యిది సాక్షిమొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకుపొదిగొన్న యాగములే భువిలో సాక్షి
బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకుపొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షియిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతడనుటకువరమిచ్చే శ్రీవేంకటేశుడే సాక్షి
kaadanna vaariki vaarikarmamE saakShiyEdesa choochina maaku neeta@mDE saakShi
vEdaalu satyamouTaku vishNu@mDu matsyaroopamaiaadaTa@m dechchi nilipe nadi saakShiaadi@m garmamulu satyamauTaku brahmAyagAnapOditO nItaDu yaj~nabhOktauTE sAkshi
ade brahmamu sAkAramauTaku purushasUkta-meduTa viSwarUpamu yidi sAkshimodalanuMDi prapaMchamunu tathyamaguTakupodigonna yAgamulE bhuvilO sAkshi
berasi jIvESwarula bhEdamu galuguTakupori brahmAdula haripUjalE sAkshiyiravai dAsyAna mOkshamichchu nItaDanuTakuvaramichchE SrIvEMkaTESuDE saakshi