SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Wednesday, November 17, 2010

GOPALAKRUSNUDU


బంగారుచెంబుతో పన్నీరుపట్టుకు పణతిరుక్మిణివచ్చె మేలుకో
రంగైనపాదాలు చెంగట పూనుకు రమణి సత్య వచ్చె మేలుకో
తెలవారవచ్చేను

దంతకాష్టముపూని తామరసాక్షి సుదంతి వచ్చిందయ్యా మేలుకో
అంతకుమున్ను రుమాళ్ళు పట్టుకు జాంవతి వచ్చింది మేలుకో
తెలవారవచ్చేను

పొందుగ కస్తూరి భరిణె పట్టుకుకాళింది వచ్చిందయ్యా మేలుకో
అందముగానిలువుటద్దముగొని మిత్రవింద వచ్చిందయ్యా మేలుకో
తెలవారవచ్చేను

పంచభక్ష్యాన్నములు పళ్ళెములోవుంచుకు భద్ర వచ్చిందయ్యా మేలుకో
వాలాయముగ తాంబూలము పట్టుకు లక్షణ వచ్చింది మేలుకో
తెలవార వచ్చేను

పొందుగ వీణవాయించుతూ రాకేందురాధ వచ్చిందయ్యా మేలుకో
పదహారువేలస్త్రీలంతా స్వగతాలపాళి తెచ్చున్నారు మేలుకో
తెలవార వచ్చేను


baMgAruceMbutO pannIrupaTTuku paNatirukmiNivacce mElukO
raMgainapaadaalu ceMgaTa pUnuku ramaNi satya vacce mElukO
telavaaravaccEnu

daMtakaaShTamupUni taamarasaakShi sudaMti vacciMdayyaa mElukO
aMtakumunnu rumALLu paTTuku jaaMvati vacciMdi mElukO
telavaaravaccEnu

poMduga kastUri BariNe paTTukukaaLiMdi vacciMdayyaa mElukO
aMdamugaaniluvuTaddamugoni mitraviMda vacciMdayyA mElukO
telavaaravaccEnu

paMcaBakShyaannamulu paLLemulOvuMcuku bhadra vacciMdayyaa mElukO
vaalaayamuga taaMbUlamu paTTuku lakShaNa vacciMdi mElukO
telavaara vaccEnu

poMduga vINavaayiMcutU raakEMduraadha vacciMdayyaa mElukO
padahaaruvElastrIlaMtaa swagataalapaaLi teccunnaaru mElukO


No comments:

Post a Comment