Verrivaadu Verrigaadu dvmohanakrishna
వెఱ్ఱీవాడు వెఱ్ఱిగాడు; విష్ణునిదాస్యము లేక
విఱ్ఱవీగేయహంకారి వెర్రివాడు
నాలుకపై శ్రీహరినామ మిట్టే వుండగాను
జోలితో మఱచిననీచుడే వెఱ్ఱివాడు
ఆలరియీజగమెల్లా హరిరూపై వుండగాను
వాలి తలపోయలేనివాడు వెఱ్ఱివాడు
కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే
కోరి వేరే కలడనేకుమతి వెఱ్ఱివాడు
చేరి తనయాత్మలోన శ్రీరమణుడుండగాను
దూరమై తిరుగువాడే దొడ్డవెఱ్ఱివాడు
సారపు శ్రీవేంకటేశుశరణాగతి వుండగా
సారె గర్మములంటేడిజడుడు వెఱ్ఱివాడు
చేరువ నాతనిముద్ర చెల్లుబడి నుండగా
మోరతోపైవున్నవాడే ముందు వెఱ్ఱివాడు
ve~r~riivaaDu ve~r~rigaaDu; viShNunidaasyamu lEka
vi~r~ravIgEyahaMkaari verrivaaDu
naalukapai SrIharinaama miTTE vuMDagaanu
jOlitO ma~rachinanIchuDE ve~r~rivaaDu
aalaariyIjagamellaa harirUpai vuMDagaanu
vaali talapOyalEnivaaDu ve~r~rivaaDu
kUrimi brahmaaMDaalu kukshinunna harikaMTE
kOri vErE kalaDanEkumati ve~r~rivaaDu
chEri tanayaatmalOna SrIramaNuDuMDagaanu
dUramai tiruguvaaDE doDDave~r~rivaaDu
saarapu SrIvEMkaTESuSaraNaagati vuMDagaa
saare garmamulaMTEDijaDuDu ve~r~rivaaDu
chEruva naatanimudra chellubaDi nuMDagaa
mOratOpaivunnavaaDE muMdu ve~r~rivaaDu
verxrxivADu_verxrxivADu-dmk-.mp3
No comments:
Post a Comment