SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Wednesday, December 21, 2011

Mudamalara kaalamula

ముదమలర కాలముల మీరిటు మోసపోక
హృదయమలర భజింపరో మీరిటు 
ధనుర్మాసముల విధులన్


వేగనాలుగు ఘడియలనగా 
వేదవేద్యులు లేచి సరగున
నాగమోక్తవిధులను తమదేహానుగుణములుగా
వేగమున సంధ్యాదులొగిఁ గా
వించి విమలాంబోధిశయనుని
బాగుగ పూజించరో యెడ
పక ధనుర్మాసముల విధులనె ఘనులు


పరగు చీనాంబరములను నతి
పరిమళమ్ముల బుష్పముల కడు
వెరవుగా వేంకటాపతి (కినై) వేద్య సంగతుల
అరుదుగా ధూపముల బహుదీ
పాదులను తాంబూల విధులను
పరగ పూజింపుడు సమస్త
ప్రభు ధనుర్మాసమున విధులన్(నె) ఘనులు


Audio Link: Sri G.Balakrishnaprasad

mudamalara kAlamula mIriTu mOsapOka
hRdayamalara bhajiMparO mIriTu dhanurmAsamula vidhulan


vEganAlugu ghaDiyalanagA 
vEdavEdyulu lEchi saraguna
nAgamOktavidhulanu tamadEhAnuguNamulugA
vEgamuna saMdhyAdulogi@M gA
viMchi vimalAMbOdhiSayanuni
bAguga pUjiMcharO yeDa
paka dhanurmAsamula vidhulane ghanulu


paragu chInAMbaramulanu nati
parimaLammula bushpamula kaDu
veravugA vEMkaTApati (kinai) vEdya saMgatula
arudugA dhUpamula bahudI
pAdulanu tAMbUla vidhulanu
paraga pUjiMpuDu samasta
prabhu dhanurmAsamuna vidhulan(ne) ghanulu

Tuesday, November 15, 2011

Verrivaadu Verrigaadu


Verrivaadu Verrigaadu dvmohanakrishna
వెఱ్ఱీవాడు వెఱ్ఱిగాడు; విష్ణునిదాస్యము లేక
విఱ్ఱవీగేయహంకారి వెర్రివాడు

నాలుకపై శ్రీహరినామ మిట్టే వుండగాను
జోలితో మఱచిననీచుడే వెఱ్ఱివాడు
ఆలరియీజగమెల్లా హరిరూపై వుండగాను
వాలి తలపోయలేనివాడు వెఱ్ఱివాడు

కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే
కోరి వేరే కలడనేకుమతి వెఱ్ఱివాడు
చేరి తనయాత్మలోన శ్రీరమణుడుండగాను
దూరమై తిరుగువాడే దొడ్డవెఱ్ఱివాడు

సారపు శ్రీవేంకటేశుశరణాగతి వుండగా
సారె గర్మములంటేడిజడుడు వెఱ్ఱివాడు
చేరువ నాతనిముద్ర చెల్లుబడి నుండగా
మోరతోపైవున్నవాడే ముందు వెఱ్ఱివాడు



ve~r~riivaaDu ve~r~rigaaDu; viShNunidaasyamu lEka
vi~r~ravIgEyahaMkaari verrivaaDu

naalukapai SrIharinaama miTTE vuMDagaanu
jOlitO ma~rachinanIchuDE ve~r~rivaaDu
aalaariyIjagamellaa harirUpai vuMDagaanu
vaali talapOyalEnivaaDu ve~r~rivaaDu


kUrimi brahmaaMDaalu kukshinunna harikaMTE
kOri vErE kalaDanEkumati ve~r~rivaaDu
chEri tanayaatmalOna SrIramaNuDuMDagaanu
dUramai tiruguvaaDE doDDave~r~rivaaDu

saarapu SrIvEMkaTESuSaraNaagati vuMDagaa
saare garmamulaMTEDijaDuDu ve~r~rivaaDu
chEruva naatanimudra chellubaDi nuMDagaa
mOratOpaivunnavaaDE muMdu ve~r~rivaaDu
verxrxivADu_verxrxivADu-dmk-.mp3



Saturday, October 29, 2011

Chudachinnadanimte - Sri Garimella Balakrishna Prasad
చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి


కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ 
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి


సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి


కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి



chUDachinnadAVanaviMtE suddulu kOTAna@MgOTi
yEDEDa nEruchukoMTivE vO kaliki


kinneramITulalOni giligiMtalu , nI 
vannela kanuchUpula valavaMtalu
yennarAni yichchakapu TelayiMtalu
yennaDu nEruchukoMTivE vO kaliki


sAreku neDavAyani sarasamulu , nI
tArukANa sannala tamakamulu
gAraviMchi bujjagiMchE gamakamulu
yErIti nEruchukoMTivE vO kaliki


kaMduva SrIvEMkaTESu kalayikalu , nI
yaMdamaina samarati yalayikalu
poMdula munumuMgili polayikalu
yeMdeMdu nEruchukoMTivE vO kaliki

Monday, July 11, 2011

Annamayya Jivitha Charitra_Smt Jayanti Savitri

http://www.esnips.com/doc/5e384ef9-984d-4064-a0e8-689bd1414635/Annamayya_Jayanti-Savitri GURU POURNAMI SUBHAKAMKSHALATO

Life Story of  Padakavitha Pitamaha Sri Tallapaka Annamacharya rendered in the form of Harikatha  by Smt. Jayanti Savitri a renowned Harikatha Bhagavatarini  who has travelled  many a countries in the world. Please bear the audio distrbance for one or two minutes in the beginning.


పదకవితామహుడు, సద్గురువులైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జీవితచరిత్ర ను  ప్రఖ్యాత  హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గారిచే ఆలపించబడిన హరికథా కాలక్షేపం భక్తులందరికోసం.  ప్రారంభంలో ఈ ఆడియో కొంచెం డిస్ట్రబన్సు ఉన్నా ఒకటి రెండు నిముషాల తరువాత చాల బాగా ఉంటుంది.

Attention Please

We are posting different songs and lyrics in this Blog to enable all interested persons to have an exposure  to such rare literature and music just for listening or for reading purpose only.  If anybody having objections for showing their lyrics or music/songs/images, immediately they will be removed from this Blog.
Blogger.

Sunday, May 29, 2011

Paramapaatakuda-Anandabhattar

Paramapaatakuda-AB




పరమపాతకుడ భవబంధుడశ్రీ
హరి నిను దలచనే నరుహుడనా

అపవిత్రుడనేనమంగళుడ గడు
నపగతపుణ్యుడ నలుసుడను
కపటకలుష పరికరహౄదయుడనే
నపవర్గమునకు నరుహుడనా

అతిదుష్టుడనే నధికదూషితుడ
హతవివేకమతి నదయుడను
పతిలేనిరమాపతి మిముదలచలే
నతులగతికినేనరుహుడనా

అనుపమ విషయ పరాధీనుడనే
ననంతమోహభయాతురుడ
వినుతింపగ దిరువేంకటేశ ఘను
లనఘులుగాక నేనరుహుడనా
paramapaatakuDa bhavabaMdhuDaSrI
hari ninu dalachanE naruhuDanaa

apavitruDanEnamaMgaLuDa gaDu
napagatapuNyuDa nalusuDanu
kapaTakaluSha parikarahRudayuDanE
napavargamunaku naruhuDanaa

atiduShTuDanE nadhikadUShituDa
hatavivEkamati nadayuDanu
patilEniramaapati mimudalachalE
natulagatikinEnaruhuDanaa

anupama viShaya paraadhInuDanE
nanaMtamOhabhayaaturuDa
vinutiMpaga diruvEMkaTESa ghanu
lanaghulugaaka nEnaruhuDanaa





Tuesday, May 24, 2011


Annamacharya Jayanti 17.5.2011


































హరిశరణాగతిమండలి భువనేశ్వర్, ఒరిస్సా, 17.5.2011 నాడు ఉదయం 8 గంటలనుండు సాయంత్రం 8 గంటలవరకు స్థానిక తి.తి.దే కళ్యాణమండపమునందుగల శ్రీశ్రీశ్రీ వరద వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాన్ని 12 గంటలసేపు జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో 6 సం.నుండి 65 సం.వరకు గలవారు పాల్గొని 108 సంకీర్తనలను ఆలపించారు. డి.పి.పి.శ్రీకాకుళం  కళాకారులు ప్రక్కవాద్యములాతొ  సహకరించారు. మండలి కన్వీనరు శ్రీమురళీకౄష్ణగారి అధ్వర్యంలో బ్రహ్మాండముగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి జయప్రదం చేసారు.  తి.తి.దే అన్నమ్మాచర్య ప్రోజెక్టువారికి ప్రత్యేక కృతజ్ఞలతో   కార్యక్రమం ముగిసింది.