ఏబదునాలుగులోకముల-సౄష్టియొనర్చుచు బెంచి పిమ్మటన్
దూబవలెన్ హరింతు నని-దొంగనుడుల్ వచియించు చుంటివే!
యేబదిమాటలేమిటికి?-ఇట్టిప్రచారము మానకున్నచో
గూబలు సాగదీసెదను గూయకు మిట్టివి ధూర్తమానవా!---1
ఎవ్వరు చూచినారు శ్రుజి-యింపగ నీ పదునాలుగులోకముల్
సువ్వన సువ్వి సువ్వి యను-చొప్పెకదా! యొకడైన జూచెనే
దవ్వులనుండియైన నొక-దానినైన? వౄథా ప్రగల్భముల్!
నవ్వుల పాలుజేసెదవె-నన్నిటులాడుచు ధూర్తమానవా!---2
ప్రతివర్షంబును నా వివాహమనుపే-రన్ బెక్కుచందాల దు
ర్మతి చందాలు వసూలుచేసి ప్రతియూ-రన్ గజ్జికట్టింతువే!
గతి యీమాత్రములేదె నాక్రయ? నే-గావించుకోలేనే? యీ
గతి నన్నీవు ప్రాభవించుటకు సం-కల్పింతువే మానవా!---3
ఇంకావుంది
No comments:
Post a Comment