Nanabhaktulivi_MBK
నానా భక్తులివి నరులమార్గములు
యేనెపానైనా నాతడియ్యకొను భక్తి
హరికిగా వాదించుటది ఉన్మాదభక్తి
పరుల గొలుపకుంటే పతివ్రతాభక్తి
అరసి యాత్మ గనుటదియే విజ్ఞానభక్తి
అరమరచి చొక్కుటే ఆనందభక్తి
అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి
అతనిదాసులసేవే అదియే తురీయభక్తి
క్షితినొకపని గోరిచేసుటే తామసభక్తి
అతడే గతని వుండుటది వైరాగ్యభక్తి
అట్టె స్వతంత్రుడౌటే అది రాజసభక్తి
నెట్టన శరణనుటే నిర్మలభక్తి
గట్టిగా శ్రీవేంకటేశుకైంకర్యమే సేసి
తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి
No comments:
Post a Comment