SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Sunday, May 29, 2011

Paramapaatakuda-Anandabhattar

Paramapaatakuda-AB




పరమపాతకుడ భవబంధుడశ్రీ
హరి నిను దలచనే నరుహుడనా

అపవిత్రుడనేనమంగళుడ గడు
నపగతపుణ్యుడ నలుసుడను
కపటకలుష పరికరహౄదయుడనే
నపవర్గమునకు నరుహుడనా

అతిదుష్టుడనే నధికదూషితుడ
హతవివేకమతి నదయుడను
పతిలేనిరమాపతి మిముదలచలే
నతులగతికినేనరుహుడనా

అనుపమ విషయ పరాధీనుడనే
ననంతమోహభయాతురుడ
వినుతింపగ దిరువేంకటేశ ఘను
లనఘులుగాక నేనరుహుడనా
paramapaatakuDa bhavabaMdhuDaSrI
hari ninu dalachanE naruhuDanaa

apavitruDanEnamaMgaLuDa gaDu
napagatapuNyuDa nalusuDanu
kapaTakaluSha parikarahRudayuDanE
napavargamunaku naruhuDanaa

atiduShTuDanE nadhikadUShituDa
hatavivEkamati nadayuDanu
patilEniramaapati mimudalachalE
natulagatikinEnaruhuDanaa

anupama viShaya paraadhInuDanE
nanaMtamOhabhayaaturuDa
vinutiMpaga diruvEMkaTESa ghanu
lanaghulugaaka nEnaruhuDanaa





Tuesday, May 24, 2011


Annamacharya Jayanti 17.5.2011


































హరిశరణాగతిమండలి భువనేశ్వర్, ఒరిస్సా, 17.5.2011 నాడు ఉదయం 8 గంటలనుండు సాయంత్రం 8 గంటలవరకు స్థానిక తి.తి.దే కళ్యాణమండపమునందుగల శ్రీశ్రీశ్రీ వరద వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవాన్ని 12 గంటలసేపు జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో 6 సం.నుండి 65 సం.వరకు గలవారు పాల్గొని 108 సంకీర్తనలను ఆలపించారు. డి.పి.పి.శ్రీకాకుళం  కళాకారులు ప్రక్కవాద్యములాతొ  సహకరించారు. మండలి కన్వీనరు శ్రీమురళీకౄష్ణగారి అధ్వర్యంలో బ్రహ్మాండముగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేసి జయప్రదం చేసారు.  తి.తి.దే అన్నమ్మాచర్య ప్రోజెక్టువారికి ప్రత్యేక కృతజ్ఞలతో   కార్యక్రమం ముగిసింది.

Friday, May 20, 2011

Tandanana ahi Instrumental


Tandanana.mp3
తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా - తందనాన

బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె

కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలు డుండేటి సరిభూమి యొకటే

కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె



Tandanana

Nana bhaktulivi_Dr.Balamurali Krishna

Nanabhaktulivi_MBK

నానా భక్తులివి నరులమార్గములు
యేనెపానైనా నాతడియ్యకొను భక్తి

హరికిగా వాదించుటది ఉన్మాదభక్తి
పరుల గొలుపకుంటే పతివ్రతాభక్తి
అరసి యాత్మ గనుటదియే విజ్ఞానభక్తి
అరమరచి చొక్కుటే ఆనందభక్తి 

అతిసాహసాలపూజ అది రాక్షసభక్తి
అతనిదాసులసేవే అదియే తురీయభక్తి
క్షితినొకపని గోరిచేసుటే తామసభక్తి
అతడే గతని వుండుటది వైరాగ్యభక్తి

అట్టె స్వతంత్రుడౌటే అది రాజసభక్తి
నెట్టన శరణనుటే నిర్మలభక్తి
గట్టిగా శ్రీవేంకటేశుకైంకర్యమే సేసి
తట్టుముట్టులేనిదే తగ నిజభక్తి