మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది
వేడుకొని చదవరో వేదాంత రహస్యము
జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి
భావించి ప్రకౄతి సంపదయిది యెరుగుడే
వేవేలు విధముల వేదాంత రహస్యము
తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి
పనితోడ నందువల్ల భక్తినిలిపి
మనికిగా వైరాగ్యము మరవకుండుతే
వినవలసిన యట్టి వేదాంత రహస్యము
వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి
జాడల శరణాగతి సాధనముతో
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము
mUDEmATalu mUDumUMDlu tommidi
vEDukoni cadavarO vEdAMta rahasyamu
jIvasvarUpamu ciMtiMci yaMtaTAnu
dEvuni vaiBavamu telisi
BAviMci prakRuti saMpadayidi yeruguDE
vEvElu vidhamula vEdAMta rahasyamu
tanalOni vij~nAnamu tappakuMDA dalabOsi
panitODa naMduvalla Baktinilipi
manikigA vairAgyamu maravakuMDutE
vinavalasina yaTTi vEdAMta rahasyamu
vEDukatO nAcArya viSvAsamu galigi
jADala SaraNAgati sAdhanamutO
kUDi SrIvEMkaTESugolici dAsuDauTE
vIDani brahmAnaMda vEdAMta rahasyamu
No comments:
Post a Comment