అలకలు మానవే అలమేలుమంగమ్మ
తలపుల నీ స్వామి తగునని దరి చేర
చరణం - 1
ఆమని సొగసుల కోమలి నిను జూచి
ఏమరగా చేరి గోముగ సవరించి
తమకము శ్రీహరి తడబడు అడుగుల
భామను చేరిన భావము కనరో
చరణం - 2
ఆనంద నిలయాన ఆనంద నందనుడు
కనకాంగి కమలేశు నర్ధాంగివని నిన్ను
ఘనమగు కౌగిలి రతి గూడి రమియింప
చనువున నిను కోరి తనువెల్ల పులకింప
చరణం - 3
సరసిజ నాభుని సరోజ దళనేత్రి
మరుమము తెలియని మాకిల జనయిత్రి
పరమ పురుషుడగు వేంకటనాధుని
మురళీ రసఝరీ మధురిమలుప్పొంగ
alakalu maanavE alamElumaMgamma
talapula nI swaami tagunani dari chEra
charaNaM - 1
aamani sogasula kOmali ninu jUchi
Emaragaa chEri gOmuga savariMchi
tamakamu SrIhari taDabaDu aDugula
bhaamanu chErina bhaavamu kanarO
charaNaM - 2
aanaMda nilayaana aanaMda naMdanuDu
kanakaaMgi kamalESu nardhaaMgivani ninnu
ghanamagu kougili rati gUDi ramiyiMpa
chanuvuna ninu kOri tanuvella pulakiMpa
charaNaM - 3
sarasija naabhuni sarOja daLanEtri
marumamu teliyani maakila janayitri
parama puruShuDagu vEMkaTanaadhuni
muraLI rasajharI madhurimaluppoMga
No comments:
Post a Comment