శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీసతి వల్లభా
శరణు రాక్షస గర్వ సంహర శరణు వేంకటనాయకా
స్వామి శ్రీ రఘునాయకా
శరణు శరణు హరే హరే
పరమపద గోవింద మాధవ పద్మనాభ జనర్ధనా
ధరణిధరవర గరుడవాహన దైత్యబలిమదభంజన
దాస మానస రంజన
శరణు శరణు హరే
కమలధరుడును కమలమిత్రుడు కమలశత్రుడు పుత్రుడు
క్రమముతొ మీకొలువు కిప్పుడు కాచినా రెచ్చరికయా
ఆనిమిషేంద్రులు మునులు దిక్పతులమర కిన్నర సిద్ధులు
ఘనతతో రంభాదికాంతలు కాచినా రెచ్చరికయా
ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా
SaraNu SaraNu suraemdra sannuta Saranu Sreesati vallabhaa
SaraNu raakshasa garva saMhara SaraNu vEMkaTanaayakaa
swAmi SrI raghunaayakaa
SaraNu SaraNu harE harE
paramapada gOviMda maadhava padmanaabha janardhanaa
dharaNidharavara garuDavaahana daityabalimada bhaMjana
daasa maanasa raMjana
SaraNu SaraNu harE
kamaladharuDunu kamalamitruDu kamalaSatruDu putruDu
kramamuto meekoluvu kippuDu kaachinaa rechcharikayaa
Animishaemdrulu munulu dikpatulamara kinnara siddhulu
GhanatatO rambhaadikaamtalu kaachinaa rechcharikayaa
ennagala prahlaada mukhyulu ninnu goluvaga vachchiri
Vinnapamu vinavayya tirupati vaemkaTaachalanaayakaa
No comments:
Post a Comment