SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Monday, December 20, 2010

ANNAMAYYA SAMKIRTANALU__ALAMELUMANGA

AUDIO LINK

కొమ్మనీపలుకులకు కుశలమస్తు
సమ్మదపు వయసుకు యైశ్వర్యమస్తు

బెడగు కళలను చాల పెంపొందించుచున్న నీ
యుడురాజు మోమునకభ్యుదయమస్తు
కడివోనినీరజపు కళికలను గేరు నీ
నెడద కుచములకు నభివృధ్ధిరస్తు

వొగరుమిగులగ తేనెలొలుకునున్నట్టి నీ
చిగురుమోవికిని ఫలసిద్ధిరస్తు
సొగసుచక్రములతో సొలయు నీపిరుదులకు
అగణితమనోరధావ్యాప్తిరస్తు

తనరు తుమ్మెదగముల తరము నీకురులకును
అనుపమంబైన దీర్ఘాయురస్తు
నను ద్వారకాకృష్ణుడనుచు గూడిన నీకు
అనుదినము నిత్యకళ్యాణమస్తు

kommanIpalukulaku kuSalamastu
sammadapu vayasuku yiSwaryamastu

beDagu kaLalanu cAla peMpoMdiMcucunna nI
yuDurAju mOmunakabhyudayamastu
kaDivOninIrajapu kaLikalanu gEru nI
neDada kucamulaku nabhivRdhdhirastu

vogarumigulaga tEnelolukununnaTTi nI
cigurumOvikini phalasiddhirastu
sogasucakramulatO solayu nIpirudulaku
agaNitamanOradhaavyaaptirastu

tanaru tummedagamula taramu nIkurulakunu
anupamaMbaina dIrghaayurastu
nanu dwaarakaakRShNuDanucu gUDina nIku
anudinamu nityakaLyANamastu



No comments:

Post a Comment