SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Tuesday, December 14, 2010

GOPALAKRUSHNUDU




S.JANAKI

ఓ యశోద యేమిచేయుదుమే నీకొడుకు దుడుకులకు
ఓయశోద యేమిచేయుదుమే


నిన్న సందెవేళ మాచిన్నది జలకమ్ములాడ
వన్నెకాడు చీరలెత్తుకు పోయేకాదమ్మా
అయ్యయ్యో యీ అన్యాయం యెన్నడూ మేమెరుగమమ్మా
పిలిచి నీతో చెప్పబోతే కౄష్ణుడేమియెరుగడంటివి

ఆటకే నువు పోతివి రోటికే నేకడితిని
గొల్లభామలిండ్లకేగి కోర్కె తీర్చమంటివట
వద్దురా పోవద్దురా  యీరద్దులు మనకొద్దురా
ముద్దులయ్యా నేను చెప్పిన బుధ్ధులు విని యింటనుండు
వద్దురా పోవద్దురా

పల్లవపాణులుకూడి చల్లలమ్మగాను వారి
యిల్లుచేరి కొల్లగొట్టివెళ్ళె గాదమ్మా
అయ్యయ్యో యీ అన్యాయం యెన్నడూ మేమెరుగమమ్మా
పిలిచి నీతో చెప్పబోతే కౄష్ణుడేమియెరుగడంటివి

వెన్నముద్దల దొంగవు ఎవరికైనా లొంగవు
బయలుపడిన పొంగవు నాభావమెరిగి వుండవు
వద్దురా పోవద్దురా
ముద్దులయ్యా నేను చెప్పిన బుధ్ధులు విని యింటనుండు
వద్దురా పోవద్దురా

ఇట్లాగైతే కాపురము ఎట్లాగు వేగింతుమమ్మా
పట్టిదండింపరాదా పాపమేమమ్మా
వట్టిమాటలుగాదమ్మా మా చట్టిలోని వెన్న నేల-
కొట్టి పారవేసెనమ్మా దిట్టడై పరిగెత్తేనమ్మా


నిందలేవొడిగడితివి నీతులేచెడగొడితివి
కానిపనులకు పోతివి అపకీర్తి మనకుతెస్తివి
వద్దురా పోవద్దురా




O yaSOda yEmicEyudumE nIkoDuku duDukulaku
OyaSOda yEmicEyudumE


ninna saMdevELa maacinnadi jalakammulaaDa
vannekaaDu cIralettuku pOyEkaadammaa
ayyayyO yI anyaayaM yennaDU mEmerugamammaa
pilici nItO ceppabOtE kRuShNuDEmiyerugaDaMTivi


ATakE nuvu pOtivi rOTikE nEkaDitini
gollabhaamaliMDlakEgi kOrke tIrcamaMTivaTa
vadduraa pOvadduraa  yIraddulu manakodduraa
muddulayyaa nEnu ceppina budhdhulu vini yiMTanuMDu
vadduraa pOvadduraa


pallavapaaNulukUDi callalammagaanu vaari
yillucEri kollagoTTiveLLe gaadammaa
ayyayyO yI anyaayaM yennaDU mEmerugamammaa
pilici nItO ceppabOtE kRuShNuDEmiyerugaDaMTivi


vennamuddala doMgavu evarikainaa loMgavu
bayalupaDina poMgavu naabhaavamerigi vuMDavu
vadduraa pOvadduraa
muddulayyaa nEnu ceppina budhdhulu vini yiMTanuMDu
vadduraa pOvadduraa


iTlaagaitE kaapuramu eTlaagu vEgiMtumammaa
paTTidaMDiMparaadaa paapamEmammaa
vaTTimaaTalugaadammaa maa caTTilOni venna nEla-
koTTi paaravEsenammaa diTTaDai parigettEnammaa




niMdalEvoDigaDitivi nItulEceDagoDitivi
kaanipanulaku pOtivi apakIrti manakutestivi
vadduraa pOvadduraa

No comments:

Post a Comment