SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Wednesday, December 15, 2010

KRISHNARAVALI




Meluko-kannayya
మేలుకో కన్నయ్య మేలుకోవయ్యా
వేగమే మేలుకొని మమ్మేలుకోవయ్యా


అందాలబాలరవి లేలేతకిరణాల అంబరము వింతగా శోభిల్లు తరియాయె
పందాలువేసుకొని పడుచు భామలు అందచందాలముగ్గులను తీర్చేటి తరియాయె


వేయిపడగల నాగరాజుపై శయనించి వేల్పులందరు భక్తియుక్తులైయొనరించు 
వేలాది వందనములందుకొనువేళాయె వేణుగానవిలోల వేగమే మేలుకో


అజ్ఞానతిమిరాన యే దారి కనరాక అల్లలాడే భీతమానవులందరికీ 
సుజ్ఞాన కాంతులను వెదజల్లి దరిజేర్చి విజ్ఞానులను చేయు వేళాయె మేలుకో

mElukO kannayya mElukOvayyaa
vEgamE mElukoni mammElukOvayyaa

aMdAlabaalaravi lElEtakiraNAla aMbaramu viMtagaa SOBillu tariyaaye
paMdaaluvEsukoni paDucu bhaamalu aMdacaMdAlamuggulanu tIrcETi tariyaaye

vEyipaDagala nAgaraajupai SayaniMci vElpulaMdaru bhaktiyuktulaiyonariMcu 
vElaadi vaMdanamulaMdukonuvELAye vENugaanavilOla vEgamE mElukO

aj~naanatimiraana yE daari kanaraaka allalaaDE bhItamaanavulaMdarikI 
suj~naana kaaMtulanu vedajalli darijErci vij~naanulanu cEyu vELAye mElukO

No comments:

Post a Comment