SRI TAALLAPAAKA ANNAMACHARYA

SRI TAALLAPAAKA ANNAMACHARYA
IthaDe Parama GuruDu ItaDannamaachaaryuDu

Friday, December 10, 2010

GOPALAKRUSHNUDU



AUDIO LINK--S.JANAKI

కస్తూరి రంగ రంగ మా యన్న కావేటి రంగ రంగ
శ్రీరంగ రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా


కంసుణ్ణి సంహరింప సద్గురుడు  అవతారమెత్తినపుడు 
దేవకీగర్భమునను కౄష్ణావతారమై జన్మించెను


ఏడు రాత్రుళ్ళు కలిసి  తానుగా ఏక రాత్రిగ చేసెను
ఆదివారము పూటను  అష్టమి దినమందు జన్మించెను


తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు 
ఎదురు కాళ్ళను పుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు


పాలవర్షము కురిసెను అప్పుడా బాలపై చల్లగానే
తడివస్త్రమును విడిచెను  దేవకీ పొడివస్త్రములు గట్టెను


వసుదేవపుత్రుడమ్మా యీ బిడ్డ వైకుంఠవాసుడమ్మా
అడ్డాలలోవేసుకు ఆబాల చక్కదనమును చూసెను


యీబిడ్డ వైకుంఠ వాసుడమ్మా

kastUri raMga raMga maa yanna kAvETi raMga raMga
SrIraMga raMga ninu baasi nEneTlu maracuMduraa

kaMsuNNi saMhariMpa sadguruDu  avataaramettinapuDu 
dEvakIgarbhamunanu kRuShNAvataaramai janmiMcenu

EDu rAtruLLu kalisi  taanugaa Eka raatriga cEsenu
aadivaaramu pUTanu  aShTami dinamaMdu janmiMcenu

talatOTi jananamaitE tanaku bahu mOsaMbu vaccunanucu 
eduru kaaLLanu puTTenu EDuguru daadulanu caMpenapuDu

paalavarShamu kurisenu appuDA baalapai callagaanE
taDivastramunu viDicenu  dEvakI poDivastramulu gaTTenu

vasudEvaputruDammaa yI biDDa vaikuMThavaasuDammaa
aDDAlalOvEsuku aabaala cakkadanamunu cUsenu

yIbiDDa vaikuMTha vaasuDammaa

1 comment:

  1. "కస్తూరి రంగ రంగ మా యన్న కావేటి రంగ రంగ
    శ్రీరంగ రంగ నిను బాసి నేనెట్లు మరచుందురా" Please send this song full version to download in MP3 or Script also useful for us. Thank you so much for early response in this regard.

    Kindly send this to Email ID: anandarao1963@gmail.com

    ReplyDelete