నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో
మురహర భవహర ముకుంచ మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో
జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ
బలిబంధన గోపవధూవల్లభ
నళినోదరతే నమో నమో
ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్దర శ్రీవేంకటనాయక
నాదప్రియతే నమో నమో
naaraayaNatae namO namO
naarada sannuta namO namO
murahara bhavahara mukumcha maadhava
garuDa gamana paMkajanaabha
parama purusha bhavabamdha vimOchana
naramRgaSareera namO namO
jaladhiSayana ravichamdravilOchana
jalaruhabhavanuta charaNayuga
balibamdhana gOpavadhoovallabha
naLinOdaratE namO namO
Adidaeva sakalaagama poojita
yaadavakula mOhanaroopa
vEdOddara SreevEmkaTanaayaka
naadapriyatE namO namO
అన్నమయ్య విరచించిన కొన్ని వేల సంకీర్తనా మంత్రాలలో ఈ సంకీర్తనను త్యాగరాజ ఘన పంచ రత్న రాగాలలో స్వరపరచినది ఏ మహానుభావుడో కాని ఆ మకరందాన్ని అందించినది మాత్రం శ్రీమతి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అమ్మ. సంగీత రసజ్ఞులకు ఇది ఒక ఆణిముత్యం. విని ఆస్వాదించండి. ఈ సంకీర్తన విన్నతరువాతనాఇన అన్నమయ్య సంకీర్తనలను శాస్త్రీయ సంగీతంలో ఆలపించడం జరూదు అన్న వారికి కనువిప్పు కలుగుతుంది అనుకుంటాను
ReplyDeleteannamayya virachiMchina konni vEla saMkIrtanaa maMtraalalO I saMkIrtananu tyaagaraaja ghana paMcha ratna raagaalalO swaraparachinadi E mahaanubhaavuDO kaani A makaraMdaanni aMdiMchinadi maatraM SrImati eM.es. subbulakShmi amma. saMgIta rasajnulaku idi oka aaNimutyaM. vini aaswaadiMchaMDi. I saMkIrtana vinnataruvaatanaaina annamayya saMkIrtanalanu SaastrIya saMgItaMlO aalapiMchaDam jaruadu anna vaariki kanuvippu kalugutuMdi anukuMTaanu.