G.NAGESWARA NAIDU__JHANJHUTI
ఆరగించరావయ్యా అమరవంద్యుడ
అరనూరు పైయారు అతిరుచుల భోగములు
చరణం - 1
అరిసెలు కుడుములు వడలు అప్పాలు దప్పళాలు
కరకరఫెణికాజాలు కమ్మని సున్నుండలు
బిరుసైన ఒరియాన్నము అపైన క్షీరాన్నము
వరుసల కుండలనెత్తి వడ్డించిరి పండాలు
చరణం - 2
తియ్యని కన్నికయన్నము తదుపరి వరివణ్ణము
మొయ్యనీకు ముచ్చటైన మొహురొ బెసొరొ కూరలు
ఛెయ్యనను గుబాళించి చేసిరెన్నొ నేతితోను
అయ్యనీవు దిగివచ్చి ఔపోసన పట్టవయ్య
చరణం - 3
మధురాతి మధురమైన మాల్పోవ ముద్దపప్పు
కుదియించి నీకువెట్టె ఖర్జూరపు పచ్చడులు
ముదముతోడ మమ్మేలు మాజగన్నాధుడా
పదిలముగా భుజియించు ఈ బాల భోగము
సంకీర్తన - 2 , రాగం - ఝంజూటి"
aaragiMcharaavayyaa amaravaMdyuDa
aranUru paiyaaru atiruchula bhOgamulu
charaNaM - 1
ariselu kuDumulu vaDalu appaalu dappaLaalu
karakarapheNikaajaalu kammani sunnuMDalu
birusaina oriyaannamu apaina kShIraannamu
varusala kuMDalanetti vaDDiMchiri paMDaalu
charaNaM - 2
tiyyani kannikayannamu tadupari varivaNNamu
moyyanIku muchchaTaina mohuro besoro kUralu
Ceyyananu gubaaLiMchi chEsirenno nEtitOnu
ayyanIvu digivachchi oupOsana paTTavayya
charaNaM - 3
madhuraati madhuramaina maalpOva muddapappu
kudiyiMchi nIkuveTTe kharjUrapu pachchaDulu
mudamutODa mammElu maajagannaadhuDaa
padilamugaa bhujiyiMchu I baala bhOgamu
No comments:
Post a Comment