చందన చర్చిత వందనమచ్యుత
జగన్నాధహే దీనజనాశ్రిత
గంధసులేపిత మంధరగిరిధర
నారాయణ హరి నమో నమో
చరణం - 1
నీలచక్ర శ్రీనీలాచలస్థిత
నిజభక్తుల సంక్షేమరక్షిత
భగినీభ్రాతా భద్రసుభద్ర
బలరామ సహిత సంసేవిత
చరణం - 2
శ్రీమందిరమే ఇలవైకుంఠము
ఆశ్రితజనులకు ఆరామము
అరువదినాలుగు నిత్యకళలతో
ఇరవగుశ్రీపురి జగన్నాధము
చరణం - 3
పండాదైతరి చండాలురకు
అండగ నిలచిన మెండుదైవమా
అండపిండ బ్రహ్మాండమంతటికి
వెండికొండపై మురళీధరుడ
chaMdana charchita vaMdanamachyuta
jagannaadhahE dInajanaaSrita
gaMdhasulEpita maMdharagiridhara
naaraayaNa hari namO namO
charaNaM - 1
nIlachakra SrInIlaachalasthita
nijabhaktula saMkshEmarakshita
bhaginIbhraataa bhadrasubhadra
balaraama sahita saMsEvita
charaNaM - 2
SrImaMdiramE ilavaikuMThamu
aaSritajanulaku aaraamamu
aruvadinaalugu nityakaLalatO
iravaguSrIpuri jagannaadhamu
charaNaM - 3
paMDaadaitari chaMDaaluraku
aMDaga nilachina meMDudaivamaa
aMDapiMDa brahmaaMDamaMtaTiki
veMDikoMDapai muraLIdharuDa
JAGANNADHA SAMKIRTANALU
ReplyDelete