శ్రీపురి శ్రీక్షేత్రమందు జగన్నాధుడు
ఏపరియై రథముపై ఏగుచున్నాడదివో
చరణం - 1
తాళధ్వజమును ఎక్కి తనయన్న బలరాముడు
మేళతాళములతొ మునుముందుగ నడువగ
భళిభళిజయ వెట్టుచు భూపాలుడునుగూడి
గళమునెత్తి గంధర్వ గానమాధురిచేయ
చరణం - 2
నవవిధ శౄంగారముల నెలకొని తనయన్న గని
దేవిదొళన రథముపైన సుభద్రమ్మ తావచ్చె
భువియెల్ల భగిని ప్రేమ బహుళమై ప్రభవించగ
సేవించిరి భక్తగణము నౄత్యవాద్య గీతముల
చరణం - 3
నందిఘోషునిపైన నారాయణుడై తాను
సందడినే చేయుచు సంబరాల ఆడుచు
అందరానివారికెల్ల అందివరాలిచ్చుచు
గంధమునే పూసుకొని గుండిచ గుడిచేరగ
SrIpuri SrIkShEtramaMdu jagannaadhuDu
Epariyai rathamupai EguchunnaaDadivO
charaNaM - 1
taaLadhwajamunu ekki tanayanna balaraamuDu
mELataaLamulato munumuMduga naDuvaga
bhaLibhaLijaya veTTuchu bhUpaaluDunugUDi
gaLamunetti gaMdharva gaanamaadhurichEya
charaNaM - 2
navavidha SRuMgaaramula nelakoni tanayanna gani
dEvidoLana rathamupaina subhadramma taavachche
bhuviyella bhagini prEma bahuLamai prabhaviMchaga
sEviMchiri bhaktagaNamu nRutyavaadya gItamula
charaNaM - 3
naMdighOShunipaina naaraayaNuDai taanu
saMdaDinE chEyuchu saMbaraala aaDuchu
aMdaraanivaarikella aMdivaraalichcuchu
gaMdhamunE pUsukoni guMDicha guDichEraga
No comments:
Post a Comment